డిజిటల్‌ అక్రమాలకు అడ్డుకట్ట!  | RBI to launch Digital Payments Intelligence Platform for fraud prevention | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ అక్రమాలకు అడ్డుకట్ట! 

Jun 23 2025 6:26 AM | Updated on Jun 23 2025 8:04 AM

RBI to launch Digital Payments Intelligence Platform for fraud prevention

ఆర్‌బీఐ అధ్యక్షతన పబ్లిక్, ప్రయివేట్‌ బ్యాంకుల జత 

డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ అభివృద్ధి

న్యూఢిల్లీ: డిజిటల్‌ చెల్లింపులలో పెరుగుతున్న అక్రమాలకు చెక్‌ పెట్టే లక్ష్యంతో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) డిజిటల్‌ పేమెంట్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌(డీపీఐపీ) అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందుకు పబ్లిక్, ప్రయివేట్‌ బ్యాంకులను జత కలుపుతోంది. తద్వారా ఆర్‌బీఐ పర్యవేక్షణలో డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(డీపీఐ)కు తెరతీస్తోంది. ప్రతిపాదిత ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ను పటిష్టం చేయనుంది. 

రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌ను షేర్‌ చేసుకోవడం ద్వారా అక్రమ డిజిటల్‌ లావాదేవీలకు అడ్డుకట్ట వేయనుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం డిజిటల్‌ అక్రమాలకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా పబ్లిక్, ప్రయివేట్‌ బ్యాంకులను ఆర్‌బీఐ ఏకతాటిపైకి తీసుకురానుంది. తద్వారా డీపీఐను ఏర్పాటు చేయనుంది. దీంతో డీపీఐపీని పటిష్టరీతిలో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల మొదట్లో బ్యాంకింగ్‌ అత్యున్నత సీనియర్‌ అధికారులతో ఆర్‌బీఐ సమావేశాన్ని నిర్వహించింది. రానున్న కొద్ది నెలల్లో ప్లాట్‌ఫామ్‌ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement