ఛార్జీల రూపంలో బ్యాంకులకు భారీ ఆదాయం

PNB earns Rs 170 cr in FY21 as charges - Sakshi

2020-21 ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బి)కు చార్జీల రూపంలో భారీగా ఆదాయం సమకూరింది. ఖాతాదారులు తమ ఖాతాల్లో అవసరమైన కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు ఛార్జీలు విధించడం వల్ల దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆర్టీఐ సమాచారం తెలిసింది. ఛార్జీల విధించడం వల్ల ఆర్జించిన పీఎన్‌బి ఆదాయం 2019-20లో రూ.286.24 కోట్లుగా ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఛార్జీలను విధిస్తుంటాయి.

2020-21 ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్(క్యూఏబి) రూ.35.46 కోట్లుగా(పొదుపు, కరెంట్ ఖాతా రెండింటిలోనూ) ఉంది. అయితే ఎఫ్ వై21 రెండో త్రైమాసికంలో ఏటువంటి ఛార్జీలు విధించలేదు. మూడో, నాలుగో త్రైమాసికాల్లో క్యూఏబీ నిర్వహణేతర ఛార్జీలు వరుసగా రూ.48.11 కోట్లు, రూ.86.11 కోట్లుగా ఉన్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ సహచట్టం ద్వారా దరఖాస్తు చేసుకోగా.. పీఎన్‌బీ ఈ సమాధానమిచ్చింది. అలాగే, రుణదాత సంవత్సరంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీల రూపంలో రూ.74.28 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు ఏడాది 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉంది. 2020-21 మొదటి త్రైమాసికంలో ఏటీఎం లావాదేవీ ఛార్జీలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రద్దు చేసినట్లు బ్యాంకు తెలిపింది.(చదవండి: వీటి కోసం గూగుల్​లో వెతికితే ప్రమాదమే..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top