ఫోర్బ్స్‌ ఆసియా కుబేరుల్లో మళ్లీ అంబానీనే నెం.1.. అదానీకి ఎన్నో స్థానమంటే!

Mukesh Ambani Regained Asia Richest Person Forbes Billionaire 2023 - Sakshi

ఆసియా ధనవంతుల జాబితాలో రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ 83.4 బిలియన్‌ డాలర్ల నికర విలువతో ప్రథమ స్థానానికి చేరుకున్నారు. ప్రపంచ ధనవంతుల స్థానాల జాబితాలో 9వ స్థానం దక్కించుకున్నారు. 

ఆసియా దేశాల రిచెస్ట్‌ పర్సన్‌ల జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న గౌతమ్‌ అదానీ 24వ స్థానానికి పడిపోయినట్లు బ్లూమ్‌ నివేదించింది. ఈ ఏడాది జనవరి 24న దాదాపు 126 బిలియన్ల విలువతో అదానీ ప్రపంచంలో మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నిరాధారమైన నివేదికల కారణంగా అదానీ షేర్లు పతమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నారు.

సంపాదనలో సరికొత్త రికార్డ్‌లు 
ఫోర్బ్స్ - 2023 ప్రపంచ బిలియనీర్ల జాబితాలో భారతీయులు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు. దేశం మొత్తం మీద బిలియనీర్ల జాబితా 169 మందికి చేరింది. గత ఏడాది ఆ సంఖ్య 166గా ఉంది. 

హెచ్‌సీఎల్‌ అధినేత శివ్ నాడార్ సంపద ఏడాది క్రితం నుండి 11 శాతం తగ్గి $25.6 బిలియన్లకు పడిపోయింది. అయితే అతను దేశంలోని అత్యంత సంపన్నల జాబితాలో  3వ స్థానాన్ని దక్కించుకున్నారు.  

దేశీయ వ్యాక్సిన్ కింగ్ సైరస్ పూనావాలా దేశంలో బిలియనీర్ల జాబితాలో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయినప్పటికీ అతని నికర విలువ ఏడాది క్రితం నుండి 7 శాతం పడిపోయి $22.6 బిలియన్లకు చేరుకుంది.

స్టీల్ మాగ్నెట్ లక్ష్మీ మిట్టల్ 5వ స్థానంలో ఉన్నారు. తర్వాత  ఓపీ జిందాల్ గ్రూప్ సావిత్రి జిందాల్, దిలీప్ శాంఘ్వీ, రాధాకిషన్ దమానీలు ఉన్నారు. కుమార్ మంగళం బిర్లా 9వ స్థానంలో, ఉదయ్ కోటక్ 10వ స్థానంలో ఉన్నారు. కొత్తగా ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో జీరోధా అధినేత, అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ 36 ఏళ్ల నిఖిల్ కామత్ చేరారు.

చదవండి👉 మంచులా కరిగిన ఆస్తులు.. దివాళా తీసిన అత్యంత ధనవంతుడు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top