
మురుగప్ప గ్రూప్.. క్లీన్ మొబిలిటీ విభాగం అయిన మోంట్రా ఎలక్ట్రిక్, శ్రీరామ్ హర్షతో కలిసి హైదరాబాద్‌లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్మాల్ కమర్షియల్ వెహికల్ (e-SCV) డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి మాత్రమే కాకుండా.. కంపెనీ తన ఉనికిని విస్తరించడంలో భాగంగా డీలర్‌షిప్ ప్రారంభించింది.
మోంట్రా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లో EViator కమర్షియల్ వెహికల్స్ ప్రదర్శిస్తారు. ఇవి తక్కువ పేలోడ్ కెపాసిటీ కలిగి.. చిన్న వ్యాపారాలకు అనుకూలంగా ఉంటాయి. వీటి మెయింటెనెన్స్ కూడా చాలా సులభంగా ఉంటుంది. హైదరాబాద్‌లో పెరుగుతున్న లాజిస్టిక్స్ కంపెనీలు, ఫ్లీట్ యజమానులు, వ్యవస్థాపకుల నెట్‌వర్క్ వంటి వాటికి సేవలు అందించడానికి కంపెనీ డీలర్‌షిప్ ప్రారంభించింది.

EViator వెహికల్ 80 కిలోవాట్ మోటారు ద్వారా 300 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 245 కిమీ రేంజ్ అందిస్తుందని ద్రువీకరించబడినప్పటికీ.. రియల్ వరల్డ్ రేంజ్ 170 కిమీ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ ఈ వెహికల్ కొనుగోలుపై ఏడు సంవత్సరాలు లేదా 2.5 లక్షల కిమీ వారంటీ అందిస్తోంది.
హైదరాబాద్‌లో డీలర్‌షిప్ ప్రారంభ కార్యక్రమానికి.. ఐటీ క్లీన్ మొబిలిటీ చైర్మన్ అరుణ్ మురుగప్పన్, టీఐ క్లీన్ మొబిలిటీ (మోంట్రా ఎలక్ట్రిక్) మేనేజింగ్ డైరెక్టర్ జలజ్ గుప్తా, TIVOLT ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ సాజు నాయర్ మొదలైనవారు పాల్గొన్నారు.