Meta Layoffs 2022: ‘ఆ మెయిల్‌కు నా గుండె బరువెక్కింది’..మెటా మహిళా ఉద్యోగి ఆవేదన

Anneka Patel Said My Heart Sank After I Got Mail From Meta Layoffs - Sakshi

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా తాజాగా 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో కమ్యూనికేషన్స్ మేనేజర్ అన్నేకా పటేల్ ఉన్నారు. తెల్లారి నిద్ర లేచిన నాకు మెటా పంపిన మెయిల్‌తో నా గుండె పగిలిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

మెటాలో తొలగించిన ఉద్యోగుల్లో ప్రసూతి సెలవులో ఉన్న అన్నేకా పటేల్ ఒకరు. ఆమె తన మూడు నెలల కుమార్తెకు పాలుపట్టేందుకు తెల్లవారు జామున 3 గంటలకు మేల్కొంది. ‘ఉదయం 5:35 గంటలకు నన్ను ఉద్యోగం తొలగించినట్లు నాకు ఇమెయిల్ వచ్చింది. నా గుండె బరువెక్కింది’ అని అన్నేకా పటేల్ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో తెలిపారు. కంపెనీ గణనీయంగా ఉద్యోగాల తొలగింపు ఉంటుందని విన్నాను. అందుకే ఈమెయిల్‌ చెక్‌ చేసుకున్నట్లు ఆమె చెప్పారు.

 చదవండి👉 : మెటా ఉద్యోగులకు ఊహించని షాక్‌, మార్క్ జూకర్ బర్గ్ సంచలన ప్రకటన! 

 నెక్ట్స్‌ ఏంటీ
మెటాలో ఉద్యోగం పోయింది. మరి వాట్‌ నెక్ట్స్‌ ఏంటీ? అంటే దానికి సమాధానం చెప్పడం చాలా కష్టం. నా ప్రసూతి సెలవు ఫిబ్రవరిలో ముగుస్తుంది. మాతృత్వం మొదటి కొన్ని నెలలు నా జీవితం చాలా సవాళ్లతో కూడుకున్నప్పటకీ వాటి గురించి స్పందించలేనన్నారు.

చదవండి👉 : 'టీ కప్పులో తుఫాను' కాదు..ఫేస్‌ బుక్‌ను ముంచే విధ్వంసం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top