మహీంద్రా గ్రూప్‌ రికార్డ్‌! ఈ విషయంలో ఇండియాలో తొలి ఆటోమొబైల్‌ కంపెనీగా గుర్తింపు

Mahindra and Mahindra Is The first Indian automaker to enter Dow Jones Sustainability Index - Sakshi

పర్యావరణ అనుకూల విధానాలు అవలంభిస్తున్న కార్పోరేట్‌ సంస్థలకు డౌ జోన్స్‌ సుస్థిర విధనాల ప్రపంచ సూచీ ( సస్టైనబుల్‌ ఇండెక్స్‌) 2021లో మహీంద్రా గ్రూపుకి చెందిన రెండు సంస్థలకు స్థానం దక్కింది. ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో ఇండియా నుంచి ఐదు సంస్థలు చోటు దక్కించుకోగా అందులో రెండు మహీంద్రా గ్రూపుకి చెందినవే ఉన్నాయి. గతంలో ఇండియా నుంచి తొలిసారిగా ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్న టెక్‌ మహీంద్రా ఈసారి కూడా అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేసింది. కాగా ఇండియా నుంచి ఆటోమొబైల్‌ సెక్టార్‌ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకుంది మహీంద్రా అండ్‌ మహీంద్రా.

మహారాష్ట్రలోని ఇగత్‌పురిలో ఉన్న మహీంద్రా ఇంజన్ల తయారీ యూనిట్‌ కార్బన్‌ నూట్రల్‌ యూనిట్‌గా డౌ జోన్స్‌ నుంచి గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని ఆనంద్‌ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్‌ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top