కొత్త సిమ్‌ తీసుకునేవారికి జియో బంపర్‌ ఆఫర్‌ | Jio offers starter packs for new users | Sakshi
Sakshi News home page

కొత్త సిమ్‌ తీసుకునేవారికి జియో బంపర్‌ ఆఫర్‌

Jun 17 2025 5:45 PM | Updated on Jun 17 2025 6:11 PM

Jio offers starter packs for new users

కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు సరికొత్త డిజిటల్ అనుభవాన్ని అందించేందుకు రిలయన్స్ జియో స్టార్టర్ ప్యాక్‌ను ప్రారంభించింది.  కేవలం రూ.349తో యూజర్లు ఈ ప్యాక్‌ను పొందవచ్చని కంపెనీ తెలిపింది. కొత్తగా సిమ్‌ కొనుగోలు చేసే యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఈ ప్యాక్ డిజిటల్ యుటిలిటీ, కస్టమర్ల అనుభవాన్ని పెంచే లక్ష్యంతో కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది.

జియో స్టార్టర్ ప్యాక్‌ ప్రయోజనాలు..

  • 5G నెట్‌వర్క్‌లో 28 రోజుల పాటు అపరిమిత సేవలు వినియోగించుకోవచ్చు.

  • 50 రోజుల ఉచిత జియోఫైబర్/ ఎయిర్‌ఫైబర్ ట్రయల్ కనెక్షన్ (టీవీ + వైఫై + OTT యాప్‌లు) పొందవచ్చు.

  • 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజీ పొందవచ్చు.

  • 4K క్వాలిటీతో టీవీ / మొబైల్‌లో 90 రోజుల పాటు ఉచిత జియో హాట్‌స్టార్ వీక్షించవచ్చు.

ఇదీ చదవండి: ఇంధనం వాడకుండానే వాహనాల తరలింపు

ఈ ప్రయోజనాలను ఒకే ఆఫర్‌లో అందించడం ద్వారా కొత్త వినియోగదారులకు డిజిటల్ అనుభవాన్ని సులభతరం చేయడం జియో లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలాఉండగా, ఏప్రిల్ 2025కి విడుదలైన ట్రాయ్‌ నివేదిక ప్రకారం.. అత్యంత పోటీ ఉన్న వైర్‌లెస్‌ (మొబైల్) విభాగంలో అధికంగా సబ్‌స్క్రైబర్లను జోడించింది. జియో 95,310 కొత్త సబ్‌స్క్రైబర్లను జోడించి మార్చి 2025లో 3,17,76,074 ఉన్న మొత్తం వినియోగదారులను ఏప్రిల్ 2025లో 3,18,71,384కి పెంచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement