ఐఫోన్‌ అమ్మకాలతో యాపిల్‌ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్‌!!

iPhone Sales Increased By 48 Per Cent In India In 2021 - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు చెందిన ఐఫోన్‌ అమ్మకాల్లో సరికొత్త రికార్డ్‌లు నమోదు చేస‍్తుంది. ఎన్నడూ లేని విధంగా భారత్‌లో ఐఫోన్‌లు ఈ స్థాయిలో అమ్మడుపోవడంపై ఐఫోన్‌ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

యాపిల్‌ సంస్థ గతేడా కేలండర్‌ ఇయర్‌ 2021లో ఐఫోన్‌ షిప్‌మెంట్‌లో 48శాతం వృద్దిని సాధించింది. దీంతో మార్కెట్‌ షేర్‌ మరో 4శాతం పెరిగినట్లు కొన్ని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. టెక్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ సీఎంఆర్‌ ప్రకారం..యాపిల్ ఈ ఏడాది మనదేశంలో రికార్డు స్థాయిలో 5.4 మిలియన్ ఐఫోన్‌లను డెలివరీ చేసింది. ముఖ్యంగా క్యూ4లో 2.2 మిలియన్లను డెలివరీ చేసింది. క్యూ4 ఫలితాల ప్రకారం..టెక్‌ దిగ్గజం అక్టోబర్-డిసెంబర్ కాలంలో 34 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ సందర్భంగా సీఎంఆర్‌ ప్రతినిధి ప్రభురామ్‌ మాట్లాడుతూ..ఐఫోన్‌ అమ్మకాల్లో యాపిల్ భారత్‌లో ముందంజలో ఉంది. 5 మిలియన్లకు పైగా ఐఫోన్‌లను షిప్పింగ్ చేసింది. కాంపిటీటివ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రికార్డ్‌ స్థాయిలో మరో 4.4 శాతం మార్కెట్‌ షేర్‌ను పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.ఏడాది పొడవునా దేశీయంగా పెరిగిన ఐఫోన్‌ల తయారీ , రిటైల్ మార్కెట్‌లో అమ్మకాలు జోరందుకోవడంతో పాటు పెస్టివల్‌ సీజన్‌ కారణంగా ఐఫోన్లకు డిమాండ్‌ పెరగడంతో లాభాలు నమోదు చేసిందని ప్రభురామ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఐఫోన్‌ 12కు భారీ డిమాండ్‌
భారత్‌లో 40 శాతం మార్కెట్ వాటాతో ఐఫోన్ 12 కొనసాగుతుండగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఐఫోన్ 11, ఎస్‌ఈ, ఐఫోన్‌ 13,ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్స్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా జూలై-సెప్టెంబర్ కాలంలో (క్యూ3)  యాపిల్‌  దేశంలో 1.53 మిలియన్లకు పైగా ఐఫోన్ యూనిట్లను డెలివరీ చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: యాపిల్‌ లోగోలో ఇంత విషయం ఉందా..! టచ్‌ చేసి చూడండి..అదిరిపోద్దంతే..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top