గ్లోబల్‌ ఎఫెక్ట్‌.. స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లోనే ట్రేడ్‌

Indian stock market updates 14th December 2021 Telugu - Sakshi

Stock Market Live Updates: అంతర్జాతీయ మార్కెట్‌ల బలహీన ఆరంభం.. భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ కారణంతో.. నిన్న(సోమవారం) నష్టాలతో ముగిసిన  స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నష్టాలతోనే మొదలైంది. 

మంగళవారం ఉదయం 9.23గంటలకు 363 పాయింట్లు నష్టపోయి.. 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 17, 266 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

సిప్లా బిగ్గెస్ట్‌ గెయినర్‌గా ఉండగా, బజాజ్‌ ఫైనాన్స్‌ బిగ్గెస్ట్‌ లాజర్‌గా ఉంది. నిఫ్టీ ఫార్మా బెస్ట్‌సెక్టార్‌గా, నిఫ్టీ ఐటీ వరస్ట్‌సెక్టార్‌ కేటగిరీలో కొనసాగుతున్నాయి. 

ఎర్లీ ట్రేడ్‌లో పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ ఫార్మా, హిందూలివర్‌, టైటాలన్‌లు లాభపడ్డాయి. మారుతి, యాక్సిస్‌, భారతీఎయిర్‌టెల్‌, నెస్లే ఇండియా నష్టపోయాయి.

చదవండి: టెన్షన్‌.. టెన్షన్‌.. భారీ నష్టాల్లో సెన్సెక్స్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top