
పండుగ సీజన్ ప్రారంభమవుతోంది. అప్పుడే అందరూ ప్రయాణాలు ప్లాన్ చేసుకునే పనిలో ఉంటారు. ఎక్కువ మంది రైలు ప్రయాణాలను ఎంచుకుంటారు. ఇందులో టికెట్ బుకింగ్ అనేది మొదటి పని. అయితే ఆన్ లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసేటప్పుడు తమ బోర్డింగ్, డెస్టినేషన్ పాయింట్లను నమోదు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా మంది ప్రయాణికులు తాము రైలు ఎక్కే స్టేషన్‌ను పొరపాటుగా నమోదు చేస్తుంటారు. అలాంటి వారు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుండి విశాఖపట్నంకు వెళ్లాలనుకునే ప్రయాణికులు అనుకోకుండా హైదరాబాద్ దక్కన్‌కి బదులుగా సికింద్రాబాద్ నుండి ప్రయాణాన్ని బుక్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వీలైనంత త్వరగా బోర్డింగ్ పాయింట్ మార్చుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షంలో హైదరాబాద్ దక్కన్ స్టేషన్ నుంచి రైలు ఎక్కేందుకు ప్రయాణికులను అనుమతించకపోవచ్చు.
బోర్డింగ్ స్టేషన్ రూల్స్ మార్పు
భారతీయ రైల్వే ప్రకారం, ప్రయాణికులు ఏదైనా మార్పులు చేయడానికి ముందు బోర్డింగ్ స్టేషన్ మార్పులకు సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలి.రైలు బయలుదేరిన 24 గంటల్లో బోర్డింగ్ స్టేషన్ మారితే, సాధారణ పరిస్థితుల్లో రీఫండ్ అనుమతించరు. అయితే, రైలు రద్దు, కోచ్ అటాచ్ చేయకపోవడం, రైలును మూడు గంటలకు మించి ఆలస్యంగా నడపడం వంటి అసాధారణ పరిస్థితుల్లో సాధారణ రీఫండ్ నిబంధనలు వర్తిస్తాయి.
ప్రయాణికులు బోర్డింగ్ స్టేషన్‌ను మార్చినట్లయితే, వారు అసలు బోర్డింగ్ స్టేషన్ నుండి రైలు ఎక్కే అన్ని హక్కులను కోల్పోతారు. ప్రయాణానికి సరైన అధికారం లేకుండా ప్రయాణిస్తే ఒరిజినల్ బోర్డింగ్ స్టేషన్ నుంచి మారిన బోర్డింగ్ స్టేషన్ వరకు ప్రయాణికులు పెనాల్టీతో పాటు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకసారి టికెట్ సీజ్ చేస్తే బోర్డింగ్ స్టేషన్ మార్పును అనుమతించరు.
వికల్ప్ ఆప్షన్ ఉన్న పీఎన్ఆర్‌కు బోర్డింగ్ స్టేషన్ మార్పునుకు అవకాశం ఉండదు.
ఐ-టికెట్‌కు ఆన్ లైన్ బోర్డింగ్ స్టేషన్ మార్పు ఉండదు.
కరెంట్ బుకింగ్ టికెట్‌కు బోర్డింగ్ స్టేషన్ మార్పు వీలు కాదు.
బుకింగ్ సమయంలో బోర్డింగ్ స్టేషన్‌ను ఇదివరకే మార్చినట్లయితే, "బుక్డ్ టికెట్ హిస్టరీ" విభాగానికి వెళ్లి మరొకసారి బోర్డింగ్ స్టేషన్‌ను మార్చుకోవచ్చు.