2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం | India unemployment rate dropped to 3. 1 Percentage in 2025 | Sakshi
Sakshi News home page

2025లో స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం

Mar 29 2026 4:51 AM | Updated on Mar 29 2026 4:51 AM

India unemployment rate dropped to 3. 1 Percentage in 2025

3.1 శాతానికి పరిమితం 

స్థిరంగానే మహిళా నిరుద్యోగం 

న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగం గతేడాది (2025లో) 3.1 శాతానికి తగ్గింది. 2024లో ఇది 3.2 శాతంగా ఉంది. పీరియాడిక్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే, 2025 వివరాలను కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం.. 
15 ఏళ్లకు వయసుపైబడిన మహిళల్లో నిరుద్యోగం 2024 మాదిరే 2025లోనూ 3.1% వద్దే ఉంది. పురుషుల్లో ఇది 3.3% నుంచి 3.1 శాతానికి తగ్గింది.  

గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 2024లో 2.4 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇది 2.5%గా ఉంది. పల్లెల్లో పురుషుల నిరుద్యోగం 2.6 %గా ఉంటే, మహిళల్లో 2.1%గా  నమోదైంది.  
స్వయం ఉపాధి రేటు 2024లో ఉన్న 57.5 % నుంచి 2025లో 56.2 శాతానికి తగ్గింది. 
సాధారణ లేబర్‌ పనుల్లో ఉపాధి 20.2%గా ఉంది.  

వ్యవసాయ రంగంలో ఉపాధి 2025లో 43 శాతంగా నమోదైంది. 2024లో ఉన్న 44.8 శాతంతో పోల్చితే తగ్గింది.  
నిర్మాణ రంగంలో ఉపాధి రేటు 12.3 శాతం నుంచి 12 శాతానికి తగ్గింది. ఇతర సేవల్లో ఇది 12.2 శాతం నుంచి 13.1 శాతానికి పెరిగింది.  
కార్మికుల ఆర్జన మెరుగుపడింది. పురుషుల సగటు ఆర్జన 2024లో రూ.22,891గా ఉంటే, 2025లో రూ.24,217కు పెరిగింది. మహిళా కార్మికుల ఆర్జన రూ.17,126 నుంచి రూ.18,353కు వృద్ధి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement