ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.13,16,595 కోట్లు! | India Fiscal Deficit at Rs 13.16 Lakh Crore | Sakshi
Sakshi News home page

ఆదాయాలు- వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు రూ.13,16,595 కోట్లు!

Apr 1 2022 9:38 PM | Updated on Apr 1 2022 9:38 PM

India Fiscal Deficit at Rs 13.16 Lakh Crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ఫిబ్రవరి ముగిసే నాటికి రూ.13,16,595 కోట్లుగా నమోదయ్యింది.  సంబంధిత బడ్జెట్‌ లక్ష్యంలో (రూ.15.91 లక్షల కోట్లు) ఇది 82.7 శాతానికి చేరింది. కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. 

మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.9 శాతంగా ఉండాలన్నది బడ్జెట్‌ లక్ష్యం. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఫిబ్రవరి ముగిసే నాటికి ద్రవ్యలోటు 76 శాతం ఉంటే, తాజా సమీక్షా కాలంలో ఇది 82.7 శాతానికి చేరడానికి ప్రభుత్వ అధిక వ్యయాలే కారణమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. 

ముఖ్య గణాంకాలు చూస్తే... ఫిబ్రవరి నాటికి ఆదాయాలు రూ.18.27 లక్షల కోట్లు.   వ్యయాలు రూ.31.43 లక్షల కోట్లు. సవరిత బడ్జెట్‌ లక్ష్యంలో 83.4 శాతం.  వెరసి ద్రవ్యలోటు 13.16 లక్షల కోట్లు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement