
విదేశీ టూరిస్టులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మంచి వెసులుబాటు కల్పించనుంది. వారు భారత్‌లో ఉన్నప్పుడు యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేసుకునేలా అవకాశం కల్పించాలని ప్రతిపాదించింది. దీంతో భారత్‌కు వచ్చిన విదేశీయులు తమ బ్యాంకు ఖాతాలను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి చెల్లింపు యాప్‌లకు అనుసంధానించుకుని చెల్లింపులు జరపవచ్చు.
మొదటగా జీ20 దేశాల అతిథులకు..
మొదటగా జీ20 దేశాల నుంచి వచ్చే టూరిస్టులకు ఎంపిక చేసిన ఎయిర్ పోర్టుల్లో ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన ప్రకటన సందర్భంగా వెల్లడించారు. యూపీఐ అనేది దేశవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగిస్తున్న చెల్లింపు వ్యవస్థ అని, ఇటీవల ఎన్‌ఆర్‌ఐలకు కూడా దీని సేవలను విస్తరించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే విదేశీయులకు యూపీఐ చెల్లింపుల అవకాశం ఉంటుందని, క్రమంగా దీన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తామని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: RBI repo rate hike షాకింగ్ న్యూస్: ఇక ఈఎంఐల బాదుడే బాదుడు!)