
‘ఇమాజిన్ మీ’ అనే సరికొత్త ఏఐ–పవర్డ్ ఫీచర్‌ని తీసుకువచ్చింది మెటా ఏఐ. ఈ ఫీచర్‌తో టెక్ట్స్ ప్రాంప్ట్ ఉపయోగించి యూజర్‌లు తమ ఏఐ ఇమేజ్‌లను జనరేట్ చేయవచ్చు. ‘ఇమాజిన్ మీ’ ఫీచర్‌ని వాట్సప్, ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ చాట్‌విండోస్‌లో ఉపయోగించవచ్చు.
అక్యురేట్, కస్టమైజ్డ్ ఫోటోగ్రాఫ్స్ కోసం ‘ఇమాజిన్ మీ’ యూజర్‌లకు సంబంధించి ఫ్రంట్, లెఫ్ట్, రైట్ ఫేస్‌ల సెల్ఫీలను అడుగుతుంది.
‘ఇమాజిన్ మీ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్‌స్టర్’ ‘ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్’లాంటిప్రాంప్ట్‌ను యూజర్‌లు ఇవ్వవచ్చు.
ప్రామ్ట్ సెట్టింగ్స్‌తో అదనపు మార్పులు కూడా చేయవచ్చు.
ఉదా: ఇమాజిన్ మీ యాజ్ ఏ కౌబాయ్, బట్ ఆన్ ది మూన్, వీయరింగ్ ఫ్యూచరిస్టిక్ క్లాత్స్
ఇమాజిన్ యాజ్ ఏ నైంటీస్ గ్యాంగ్‌స్టర్ సిప్పింగ్ కాఫీ ఎట్ యాన్ ఇండియన్ బీచ్
తమ ఏఐ–జనరేటెడ్ ఇమేజ్‌లు సంతృప్తికరంగా లేకపోతే ఎడిట్, రీజెనరేట్, రిమూవ్ ఇమేజెస్‌లాంటి ఆప్షన్‌లను యూజర్‌లు ఉపయోగించుకోవచ్చు.