హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్‌లు ఇవే! | Honda Premium Bikes and Full Details Here | Sakshi
Sakshi News home page

హోండా నుంచి నాలుగు ప్రీమియం బైక్‌లు ఇవే!

Jun 14 2026 3:51 AM | Updated on Jun 14 2026 4:41 AM

Honda Premium Bikes and Full Details Here

ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా’ (హెచ్‌ఎంఎస్‌ఐ) దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త ప్రీమియం బైక్‌లను విడుదల చేసింది. తన పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన 755సీసీ ప్లాట్‌ఫామ్‌పై వినూత్నమైన ‘ఈ–క్లచ్‌’ సాంకేతికతను జోడిస్తూ.. సీబీ750 హార్నెట్, ఎక్స్‌ఎల్‌750 ట్రాన్స్‌ఆల్ప్‌ బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటితో పాటు లగ్జరీ టూరింగ్‌ బైక్‌ ‘గోల్డ్‌ వింగ్‌’ను సరికొత్త కలర్‌ ఆప్షన్‌లో, రేసింగ్‌ ప్రియుల కోసం ఫ్లాగ్‌షిప్‌ సూపర్‌స్పోర్ట్‌ బైక్‌ ‘సీబీఆర్‌1000ఆర్‌ఆర్‌–ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ ఎస్‌పీ’ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న హోండా టాప్‌లైన్, బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్‌లలో ఈ బైక్‌ల బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.  

సీబీ750 హార్నెట్‌ ఈ–క్లచ్‌
ఇదొక స్ట్రీట్‌ నేకెడ్‌ బైక్‌. ఇందులో 755సీసీ ప్యారలల్‌–ట్విన్‌ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 67.5 కేడబ్ల్యూ పవర్, 75 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. షోవా 41ఎంఎం యూఎస్‌డీ ఫ్రంట్‌ ఫోర్క్స్, 5.0 అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి. అలాగే హోండా రోడ్‌సింక్‌ కనెక్టివిటీ, విభిన్న రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మల్టిపుల్‌ రైడింగ్‌ మోడ్స్‌ అందించారు.  

సీబీఆర్‌1000 ఆర్‌ఆర్‌–ఆర్‌ ఫైర్‌బ్లేడ్‌ ఎస్‌పీ 
సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్‌ టూరింగ్‌) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్‌ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్‌ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్‌’ మోడ్‌తో కూడిన రైడింగ్‌ ఆప్షన్లు, డ్యూయల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, షోవా సస్పెన్షన్‌ దీని ప్రత్యేకత.

గోల్డ్‌ వింగ్‌ (లగ్జరీ టూరింగ్‌ బైక్‌)
సుదూర ప్రాంతాల రైడింగ్‌ కోసం లగ్జరీ ఫీచర్లతో వచ్చే ఈ బైక్‌లో 1833సీసీ 6–సిలిండర్‌ ఇంజిన్‌ ఉంది. స్మూత్‌ రైడింగ్‌ కోసం 7–స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ట్రాన్స్‌మిషన్‌ (డీసీటీ)తో పాటు వెనక్కి జరుపుకోవడానికి రివర్స్, వాకింగ్‌ స్పీడ్‌ మోడ్స్‌ ఉన్నాయి. 
ఎల్రక్టానికల్లీ అడ్జస్టబుల్‌ విండ్‌్రస్కీన్, ఆపిల్‌ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో, ఎయిర్‌బ్యాగ్‌ వంటి ప్రీమియం భద్రతా ఫీచర్లు ఈ బైక్‌ సొంతం.

ఎక్స్‌ఎల్‌ 750  ట్రాన్స్‌ఆల్ప్‌
సాహస యాత్రలపై ఆసక్తి చూపే వారి కోసం (అడ్వెంచర్‌ టూరింగ్‌) దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. హార్నెట్‌ తరహాలోనే ఇందులోనూ 755సీసీ శక్తివంతమైన ఇంజిన్‌ ఉంది. కఠినమైన రోడ్లపై సులువుగా ప్రయాణించడానికి ‘గ్రావెల్‌’ మోడ్‌తో కూడిన రైడింగ్‌ ఆప్షన్లు, డ్యూయల్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, షోవా సస్పెన్షన్‌ దీని ప్రత్యేకత.

వినియోగదారులకు సరికొత్త అనుభూతి
‘‘కొత్త ‘ఈ–క్లచ్‌’ టెక్నాలజీ ద్వారా ప్రీమియం మోటార్‌సైకిల్‌ రైడింగ్‌ను మరింత సులభతరం, సౌకర్యవంతం చేస్తున్నాం. రోజువారీ నగర ప్రయాణాల నుంచి సుదూర ప్రాంతాల టూరింగ్‌ వరకు.. ఈ బైక్‌లు రైడర్లకు నమ్మకమైన, అద్భుతమైన రైడింగ్‌ అనుభూతిని అందిస్తాయి. భారతీయ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతికతను అందించాలనే మా నిబద్ధతకు ఇది నిదర్శనం’’ అని హోండా మోటార్‌సైకిల్స్‌ ప్రెసిడెంట్, సీఈఓ సుత్సుమి ఒటానీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement