రూ.72 వేలకే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. విడుదల అప్పుడే!

Hero Electric Launches Eddy Electric Two-Wheeler At INR 72000 - Sakshi

Hero Electric launches Eddy: దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ భారత వినియోగదారుల కోసం మరో కొత్త మోడల్ "ఎడ్డీ(Eddy)" ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్కూటర్‌ను తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఈ హీరో ఎడ్డీ స్కూటర్‌లో ఫైండ్ మై బైక్, ఈ-లాక్, లార్జ్ బూట్ స్పేస్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ ఎల్లో, లైట్ బ్లూ అనే రెండు రంగుల్లో లభిస్తుంది. 

అయితే, ఈ స్కూటర్ తొలడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అలాగే, రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు అని సంస్థ తెలిపింది. ఈ స్కూటర్ ధర సుమారు రూ.72,000గా ఉండే అవకాశం ఉంది. కొత్తగా తీసుకొని రాబోయే స్కూటర్ గురించి హీరో ఎలక్ట్రిక్ ఎండి నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. "స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్స్ కలిగిన అద్భుతమైన ప్రొడక్ట్ హీరో ఎడ్డీని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాం" అని అన్నారు. ఎడ్డీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే త్రైమాసికంలో విడుదల చేయనున్నట్లు సంస్థ పేర్కొంది. హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పటికే రెండు ప్రముఖ మోడల్స్ Hero Electric Atria LX, Hero Electric Flash LX  వంటి వాహనాలను విక్రయిస్తుంది. 

(చదవండి: ప్రాంతీయ విమాన సేవలకు ప్రత్యేక పాలసీ!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top