గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఆంక్షలు | hdfc mutual fund restricts gold etf fof investment limits | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ ఈటీఎఫ్‌ పెట్టుబడులపై ఆంక్షలు

Jun 6 2026 1:23 PM | Updated on Jun 6 2026 1:38 PM

hdfc mutual fund restricts gold etf fof investment limits

న్యూఢిల్లీ: గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల(ఈటీఎఫ్‌లు)లో భారీ పెట్టుబడులపై హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తాత్కాలికంగా పరిమితి విధించింది. వీటితోపాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌(ఎఫ్‌వోఎఫ్‌) పెట్టుబడులకూ పరిమితి ఏర్పాటు చేసింది. ఇందుకు ఆర్థికపరమైన, మార్కెట్‌ సంబంధిత పరిస్థితులను ప్రస్తావిస్తోంది. వెరసి పసిడి ఈటీఎఫ్‌ పెట్టుబడులపై పరిమితులు విధించిన  తొలి ఫండ్‌గా హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ నిలిచింది.

ఈ నెల 8 నుంచి హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో భారీ పెట్టుబడుల ఇన్వెస్టర్ల ప్రత్యక్ష సబ్ర్‌స్కిప్షన్‌ లావాదేవీలను అనుమతించబోమని ఒక నోట్‌లో స్పష్టం చేసింది. కనీసం రూ. 25 కోట్లు ప్రత్యక్షంగా ఇన్వెస్ట్‌చేసే పెట్టుబడిదారులకు తాజా పరిమితులు వర్తించనున్నట్లు తెలియజేసింది. ఒక నెలలో హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఎఫ్‌వోఎఫ్‌లో రూ. 10 లక్షలవరకూ పెట్టుబడిని మాత్రమే ప్రాసెస్‌ చేయనున్నట్లు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement