75 ఏళ్ల స్వాతంత్య్రం.. మూడు షిఫ్ట్‌లు, రోజుకు రూ. 50 భత్యం

Har Ghar Tiranga: National Flag Hoisted Person Receives 50 Rs Wage Per Day Karnataka - Sakshi

శివాజీనగర(బెంగళూరు): భారతదేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతటా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అభియాన్‌ను ఆచరిస్తుండగా, విధానసౌధపై ప్రతి రోజు త్రివర్ణ పతాకం ఎగురవేసే వారి భత్యం రోజుకు రూ. 50 మాత్రమే. ఈ సందర్భంగా వారు తమ భత్యం రూ.100 పెంచాలని కోరుకుంటున్నారు. గ్రూప్‌ ‘డీ’ ఉద్యోగులుగా నియామకమైన ఏడుగురు కార్మికులు తమ జెండావిష్కరణ కర్తవ్యాన్ని నిర్వహించేందుకు ప్రతిరోజు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేస్తున్నారు. హోమ్‌గార్డులతో గాని పోలీస్‌ సిబ్బందితో పని చేస్తారు. విధానసౌధ గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుండి 150 అడుగుల ఎత్తు నాలుగో అంతస్తులో 30 అడుగుల ఎత్తు కలిగిన జెండా స్తంభముంది. అంటే తాము విధానసౌధ బయట నుండి చూసే జెండాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుండి 180 అడుగుల ఎత్తులో రెపరెపలాడుతాయి.

పాదరక్షలు లేకుండానే... 
విధానసౌధపై జెండావిష్కరణ పాదరక్షలు లేకుండగా చేయటం అంత సులభమైన పని కాదు. అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని సూర్యోదయం సమయంలో కొంచెం పైకి ఎత్తాలి. సూర్యస్తమయం సమయంలో నిర్ధారించిన సమయంలో కిందకు దించాలి. పాదరక్షలు లేకుండగానే జెండావిష్కరణ చేయాలి. దానిని కిందకు దింపిన తరువాత దానిని మడవటానికి ఒక విధానముందని జెండా కర్తవ్యంలో ఉన్న సీనియర్‌ సిబ్బంది ఆంథోని మీడియాకు తెలిపారు. ఆయన 26 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నాడు.

ఆంథోని తరహాలోనే తోటి ఉద్యోగులు రాత్రి–పగలు షిఫ్ట్‌ పద్దతిలో పనిచేస్తున్నారు. వర్షం వచ్చినా కూడా వారికి సెలవు లేదు. ఉదయం 6.22కు సూర్యోదయమైతే ఏమైనా గాని ఆ సమయానికి జెండా ఆవిష్కరణ చేయాలి. ఈ ఉద్యోగులు తమ నియమించిన పనికి జీతం పొందుతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి కార్యాలయాలతో పాటు విధానసౌధలో కార్యాలయాల తలుపులు మూయటం, తెరవటం కూడా ఉంది. రోజుకు 50 రూపాయలను ఫ్లాగ్‌ డ్యూటీ కోసం ఇవ్వబడుతోందని ప్రభుత్వ డీపీఏఆర్‌ వర్గాలు తెలిపాయి. 2013లో రోజుకు 15 రూపాయలుండేది. 2016లో రోజుకు రూ.25, అప్పటి నుండి జీతం పెంచలేదు. రోజుకు రూ.100 పెంచాలని చేసిన వారి డిమాండ్‌ను ఇప్పటి వరకు పరిష్కరించలేదని డీపీఏఆర్‌ అధికార వర్గాలు తెలిపాయి. వారు విధానసౌధలో ఆవిష్కరించే జెండా 8 అడుగుల ఎత్తు, 12 అడగుల వెడల్పుతో కర్ణాటకలో అతిపెద్ద జెండాల్లో ఇది ఒకటి. 

చదవండి: వారానికి 4 రోజులే పని, త్వ‌ర‌లోనే అమ‌ల్లోకి కొత్త లేబ‌ర్ చ‌ట్టాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top