పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు | Government Extends Vivad Se Vishwas Scheme Deadline Till June 30 | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు

Apr 25 2021 4:16 PM | Updated on Apr 25 2021 4:54 PM

Government Extends Vivad Se Vishwas Scheme Deadline Till June 30 - Sakshi

కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ప్రకటన చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును మరింత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువును జూన్ 30 వరకు పొడిగించిది. కరోనా కారణంగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ట్యాక్స్‌పేయర్లు, ట్యాక్స్‌ కన్సల్టెంట్లు నుంచి గడవు పొడిగించాలని తమకు వినతులు వచ్చినట్లు సీబీడీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. సాధారణంగా వివాద్ సే విశ్వాస్ స్కీమ్ గడువు ఏప్రిల్ 30తో ముగియాల్సి ఉంది. ట్యాక్స్ పేయర్స్‌కు పన్ను అంశానికి సంబంధించి ఏమైనా వివాదాలు లేదా పాత బకాయిలు ఉంటే వాటన్నింటినీ ఈ స్కీమ్ కింద సెటిల్‌మెంట్ చేసుకోవచ్చు. ఒకేసారి కొంత మొత్తం చెల్లించి క్లియర్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి ఊరట కలగనుంది.

చదవండి: ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లపై కేంద్రం కీలక నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement