Work from Home: ఎందుకండీ వర్క్‌ ఫ్రం హోం ? ఉద్యోగులకు ఫ్రీడం ఇద్దాం!!

 Google Will Continue To Be Fully Remote Says Ceo Sundar Pichai - Sakshi

ప్రపంచ దేశాలతో పాటూ మనదేశంలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు మార్చి నెలాఖరులోగా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ మెయిల్స్‌ పంపించాయి. పనిలో పనిగా ఆఫీస్‌ వాతావరణాన్ని ఉద్యోగులకు అనుకూలంగా మార్చేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌తో జరిగిన ఓ సుందర్‌ పిచాయ్‌ మాట్లాడుతూ..కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడం, మార్కెట్‌లోని అన్ని రంగాలూ సాధారణ స్థితికి చేరడంతో.. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీస్‌లకు రావాలని పిలుపు నివ్వడంపై స్పందించారు. గూగుల్‌ సంస్థ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీస్‌కు వస్తామంటూ మెయిల్స్‌ పంపిస్తున్నారు. ఉద్యోగులు వర్క్‌, వ్యక్తిగత జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మార్చేలా కోరుకుంటున్నారని అన్నారు.


   
గత రెండేళ్లుగా ఉద్యోగులు పనిఒత్తిడి కారణంగా అసంతృప్తితో ఉన్నారని, వారికి నచ్చినట్లు వర్క్‌ కల్చర్‌ను మార్చేస్తే ప్రొడక్టివిటీతో పనిచేస్తారని తెలిపారు. అంతేకాదు వారికి ఫ్రీడం ఇవ్వడం వల్ల ఇన్నోవేటీవ్‌గా పనిచేస్తారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌కి చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలపై దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

చదవండి: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్‌ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగుల‌కు టెక్ కంపెనీల పిలుపు!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top