ఆప్టెక్‌ ఏవియేషన్‌- జీఎంఆర్‌ డీల్‌, రానున్న పలు ఉద్యోగాలు

GMR Aviation teams up with Aptech Aviation Academy for new course - Sakshi

ఆప్టెక్‌ ఏవియేషన్‌తో జీఎంఆర్‌ ఏవియేషన్‌ ఒప్పందం 

సాక్షి, ముంబై: విమానాశ్రయ నిర్వహణ, కస్టమర్ల సేవలకు సంబంధించి కోర్సును ఆఫర్‌ చేసేందుకు ఆప్టెక్‌ ఏవియేషన్‌ అకాడమీతో, జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. ‘‘ఈ కోర్సులో చేరే అభ్యర్థులకు ఆప్టెక్‌ తన కేంద్రాల్లో పూర్తి స్థాయి శిక్షణ అందించాల్సి ఉంటుంది.

ఆ తర్వాత కోర్సులో మిగిలిన భాగాన్ని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీలో పూర్తి చేయాలి’’అని జీఎంఆర్‌ ప్రకటించింది. ఈ కోర్సు అనంతరం వారికి ఉపాధి లభించనుంది. ఎయిర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ స్టాఫ్, టికెటింగ్, ప్యాసింజర్‌ సర్వీస్, సెక్యూరిటీ, క్యాబిన్‌ క్రూ తదితర విభాగాల్లో ఉపాధి అవకాశాలు ఉంటాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top