ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు ‘వింటర్‌’  దన్ను

FMCG industry sales zoom in winter - Sakshi

అమ్మకాలు.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధిపై ఆశలు 

న్యూఢిల్లీ: చలి పెరగడంతో చర్మ, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. ఈ సీజన్‌తో అయినా గ్రామీణ ప్రాంతాల్లో తమ ఉత్పత్తుల అమ్మకాలు పుంజు కుంటాయని ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు అంచనా వేసుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టనుండడంతో వినియోగం మరింత పెరుగు తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వృద్ధి రికవరీ ఉంటుందని భావిస్తున్నాయి. డాబర్, ఇమామీ, మారి­కో కంపెనీలకు సంబంధించి చర్మ సంరక్షణ, రోగ నిరోధక శక్తిని పెంచే (చ్యవన్‌ప్రాశ్‌) ఉత్పత్తుల అమ్మ­కాలు గ్రామీణ ప్రాంతాల్లో, ఈ కామర్స్‌ వేది­కలపై పెరిగాయి. ఈ ఏడాది సాగు బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందు­న, రానున్న త్రైమాసికాల్లో గ్రామీణ ప్రాంత అమ్మకాలు బలపడతాయన్న అంచనాలు కంపెనీల్లో ఉన్నాయి. 

50 శాతం మేర వృద్ధి 
తమ ఉత్పత్తుల్లో బాడీ లోషన్, సఫోలా ఇమ్యూనివేద శ్రేణి తదితర అమ్మకాలకు శీతాకాలం కీలకమని మారికో ఇండియా బిజినెస్‌ సీవోవో సంజయ్‌ మిశ్రా తెలిపారు. ఈ ఏడాది కూడా అమ్మకాలు బలంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు చెప్పా­రు. ఇప్పటికే హెయిర్‌ ఆయిల్‌ అమ్మకాలు పెరిగా­యని తెలిపారు. గత కొన్ని నెలలుగా చూస్తే బాడీ లోషన్‌ అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండంకెల స్థాయిలో పెరిగాయన్నారు. కను­క అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బాడీలోషన్‌ అమ్మకాల్లో 50 శాతానికి పైనే వృద్ధి నమోదు చేయగలమని భావిస్తున్నట్టు మిశ్రా చెప్పారు.  
మంచి డిమాండ్‌.. 
ఈ ఏడాది పండుగల సీజన్‌ తమకు రికవరీపై ఆశలు కలిగించినట్టు డాబర్‌ ఇండియా సీవోవో ఆదర్శ్‌ శర్మ తెలిపారు. డాబర్‌ చ్యవన్‌ ప్రాశ్, డాబర్‌ హనీ, గులాబరితోపాటు, చర్మ సంరక్షణ ఉత్పత్పత్తులతో వింటర్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం శీతాకాలం ప్రారంభంలో ఉన్నామని, తమ ఉత్పత్తులకు డిమాండ్‌ కనిపిస్తోందని చెబుతూ.. ఈ ఏడాది మంచి వృద్ధి నమోదు అయితే, తదుపరి డిమాండ్‌కు ఊతంగా నిలుస్తుందన్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ తక్కువగా ఉందన్నారు.

ఈ ఏడాది  సాగు మంచిగా ఉండడంతో వచ్చే త్రైమాసికం­లో అమ్మకాలు పుంజుకుంటాయన్న అంచనా­ను వ్యక్తీకరించారు. ఈ ఏడాది వింటర్‌ ఉత్ప­త్తులకు డిమాండ్‌ కనిపిస్తున్నట్టు ఇమామీ సేల్స్‌ ప్రెసిడెంట్‌ వినోద్‌ రావు తెలిపారు. ద్రవ్యోల్బణం ఉన్నప్పుటికీ శీతాకాలంలో వినియోగించే ఉత్పత్తులకు గ్రామీణ ప్రాంతాల్లో మంచి రికవరీ కనిపిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. హెచ్‌యూఎల్, డాబర్, ఇబామీ చర్మ సంరక్షణ విభాగంలో అధిక వాటాను ఆక్రమిస్తున్నాయని, ఇటీవల పామా­యిల్, ముడి చమురు ధరలు తగ్గడం వల్ల తయారీ వ్యయాల పరంగా ఇవి లాభపడతాయని నువమా గ్రూపు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అబనీష్‌ రాయ్‌ అంచనా వేశారు.  క్రమంగా పెరుగుతున్న

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top