ఫ్లిప్‌కార్ట్, ఆదిత్యా బిర్లా డీల్

Flipkart to buy 7.8pc stake in Aditya Birla Fashion  - Sakshi

ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ లో 7.8 శాతం వాటా అమ్మకం

ఫ్లిప్‌కార్ట్  1,500 కోట్ల రూపాయలతో వాటాల కొనుగోలు

సాక్షి, ముంబై: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్)  మరో బిగ్ డీల్ కుదుర్చుకుంది. ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్  తమసంస్థలో వాటాలను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ లో 7.8 వాటాను 1,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది.  ఈమేరకు  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రిఫరెన్షియల్ కేటాయింపుల ద్వారా రూ .205 (షేరుకు) ఫ్లిప్‌కార్ట్  కొనుగోలు చేయనుంది.

ఫ్లిప్‌కార్ట్-ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ ఒప్పందం ఇప్పటివరకు ఆఫ్‌లైన్ వినియోగదారుల స్థలంలో 2020 యొక్క రెండవ పెద్ద ఒప్పందం అవుతుంది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపారంతో పాటు కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ నుండి లాజిస్టిక్స్ మరియు గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయల స్థూల మొత్తానికి ఆందోళనకు గురిచేసింది.వాటా విక్రయం ఎబిఎఫ్ఆర్ఎల్  ప్రమోటర్ ,  ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు వాటాలు 55.13 శాతానికి చేరనున్నట్లు వెల్లడించింది.    ఈ ఒప్పందం ద్వారా దేశీ దుస్తుల మార్కెట్లో కంపెనీ మరింత విస్తరించే వీలున్నట్లు ఏబీ ఫ్యాషన్‌ చైర్మన్‌ కుమార్‌ మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. రానున్న ఐదేళ్లలో దేశీయ  వస్త్ర పరిశ్రమ 100 బిలియన్‌ డాలర్లను తాకనుందని  తెలిపారు.  ఫ్లిప్‌కార్ట్‌కు వాటా విక్రయం ద్వారా లభించే నిధులను బ్యాలన్స్‌షీట్‌ పటిష్టతకు, వృద్ధి అవకాశాలకూ వినియోగించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ వార్తల తరువాత, ఏబిఎఫ్ఆర్ఎల్ షేర్లు శుక్రవారం 3.5 శాతం ఎగిసాయి.

 2020 లో ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ చేసుకున్న రెండవ అతిపెద్ద డీల్ గా నిలిచింది. ఈ ఏడాది ఆగస్టులో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) యూనిట్ రిటైల్ వెంచర్స్ కిషోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్  లాజిస్టిక్స్  గిడ్డంగుల వ్యాపారాన్ని 24,713 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 3,000 దుకాణాల నెట్‌వర్క్ ఆదిత్యా బిర్లా ష్యాషన్ సొంతం. 23,700 మల్టీ-బ్రాండ్ అవుట్‌లెట్లలో ఉంది. పాంటలూన్స్ రిటైల్ ఫార్మాట్‌తో పాటు పీటర్ ఇంగ్లాండ్, అలెన్ సోలీ, వాన్ హ్యూసెన్, లూయిస్ ఫిలిప్ వంటి బ్రాండ్‌లను నిర్వహిస్తుంది.ఈ సముపార్జనతో, వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ తన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన మింత్రా తోపాటు, ఏబీఎఫ్‌ఆర్‌ఎల్ అంతర్జాతీయ, జాతీయ ప్రీమియం  బ్రాండ్లను కూడా విక్రయించనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top