జూన్‌ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్‌ | Fiscal deficit stood at 8. 1percent of full-year target at June-end | Sakshi
Sakshi News home page

జూన్‌ నాటికి ద్రవ్యలోటు 8.1 శాతానికి అప్‌

Aug 1 2024 12:50 AM | Updated on Aug 1 2024 8:07 AM

Fiscal deficit stood at 8. 1percent of full-year target at June-end

విలువ రూ. 1,35,712 కోట్లు  

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌–జూన్‌) ముగిసే నాటికి లక్ష్యంలో 8.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.1,35,712 కోట్లు.  కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీఏ) తాజా గణాంకాను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే... ఆర్థిక సంవత్సరం (2024–25) జీడీపీలో 4.9 శాతం వద్ద కట్టడి చేయాలన్నది నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ లక్ష్యం. 

విలువలో ఇది 16.14 లక్షల కోట్లు. అయితే జూన్‌ ముగిసే నాటికి ఈ విలువ రూ.1,35,712 కోట్లకు చేరిందన్నమాట. అంటే ద్రవ్యలోటు ఇప్పటికి 8.1 శాతమని అర్థం. 2023–24లో ద్రవ్యలోటు 5.6 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. 2025–26  ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు రూ.32.07 లక్షల కోట్లుగా, వ్యయాలు రూ.48.21 లక్షల కోట్లుగా బడ్జెట్‌ అంచనావేస్తోంది. వెరసి ద్రవ్యలోటు రూ.16.14 లక్షల కోట్లుగా నమోదుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement