Fau Study Find Apple Watch, Fitbit Wristband Carry Bacteria - Sakshi
Sakshi News home page

స్మార్ట్‌వాచ్‌, రిస్ట్‌ బ్యాండ్‌లను వినియోగిస్తున్నారా?..ఇదొకసారి చదవండి!

Aug 21 2023 6:58 PM | Updated on Aug 21 2023 7:48 PM

Fau Study Find Apple Watch, Fitbit Wristband Carry Bacteria - Sakshi

స్మార్ట్‌వాచ్‌, రిస్ట్‌బ్యాండ్‌ను వినియోగిస్తున్నారా? అయితే, వాటిని రోజులో ఎన్నిసార్లు శుభ్రం చేస్తున్నారు? ఎందుకంటే? మీకెంతో ఇష్టమైన యాపిల్‌వాచ్‌, ఫిట్‌బిట్‌ రిస్ట్‌బ్యాండ్‌ల వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు.   

అమెరికాకు చెందిన ఫ్లోరిడా అంట్లాటిక్‌ యూనివర్సిటీ (ఎఫ్‌ఏయూ) పరిశోధకులు ప్లాస్టిక్‌, రబ్బర్‌, క్లాత్‌, లెదర్‌, గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌తో తయారు చేసిన రిస్ట్‌ బ్యాండ్‌,స్మార్ట్‌వాచ్‌ల పై పరిశోధనలు నిర్వహించారు. ఈ రీసెర్చ్‌లో స్మార్ట్‌వాచ్‌, రిస్ట్‌ బ్యాండ్‌లను ధరించడం బ్యాక్టీరియాను ఆహ్వానించడమేనని గుర్తించారు.  

95 శాతం వేరబుల్స్‌ ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతయాని అంశాన్ని వెలుగు చూశారు. తద్వారా ఫివర్‌, డయేరియా, వ్యాధినిరోదక శక్తి తగ్గడం వంటి అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. ప్రత్యేకించి రిస్ట్‌బ్యాండ్‌ ధరించడం వల్ల చర్మ సమస్యలకు దారితీసే స్టెఫిలోకాకస్ ఎస్‌పీపీ అనే బ్యాక్టీరియాతో స్టాఫ్‌ ఇన్ఫెక్షన్‌, 60 శాతం ఈ కొల్లీ, 30 శాతం సూడోమోనాస్ ఎస్‌పీపీ (Pseudomonas spp)లు వంటి బ్యాక్టీరియాలు ఉన్నాయని పరిశోధనల్లో తేటతెల్లమైంది.  

సురక్షితంగా ఉండాలంటే
ప్లాస్టిక్, రబ్బరు రిస్ట్‌బ్యాండ్‌లలో ఎక్కువ బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉందని, మెటల్, బంగారం, వెండితో తయారు చేసిన రిస్ట్‌ బ్యాండ్‌లలో వైరస్‌ వ్యాప్తి ప్రభావం తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా రిస్ట్‌బ్యాండ్‌లు వినియోగించే స్థానాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని రీసెర్చర్‌ న్వాడియుటో ఎసియోబు అన్నారు. జిమ్‌కి వెళ్లే వారు సైతం వాచ్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అనారోగ్యానికి గురి కాకుండా ఉండేందుకు వారు ధరించే వాచ్‌లను శుభ్రపరిచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

చదవండి👉 ‘ఈ కారు కొంటే మీ ఇంటిని మీరు తగలబెట్టుకున్నట్లే’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement