పేమెంట్‌ అగ్రిగేటర్‌గా ఎన్‌క్యాష్‌కు అనుమతి

EnKash gets payment aggregator license from RBI - Sakshi

న్యూఢిల్లీ: పేమెంట్‌ అగ్రిగేటర్‌గా వ్యవహరించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి అనుమతి లభించినట్లు ఎన్‌క్యాష్‌ సంస్థ తెలిపింది. బిజినెస్‌–2–బిజినెస్‌ వ్యవస్థలో ఒలింపస్‌ బ్రాండ్‌ పేరిట కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు సంస్థ తెలిపింది.

నిరంతరాయంగా, వినూత్నమైన, విశ్వసనీయమైన పేమెంట్‌ సొల్యూషన్స్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా సంస్థ సహ–వ్యవస్థాపకుడు యద్వేంద్ర త్యాగి తెలిపారు. కార్పొరేట్‌ పేమెంట్స్‌ సొల్యూషన్స్‌ సంస్థగా ఎన్‌క్యాష్‌ 2018లో కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి దాదాపు 2,50,000 పైచిలుకు వ్యాపారాలు తమ కార్పొరేట్‌ పేమెంట్స్‌ వ్యవస్థను డిజిటలీకరించుకోవడంలో తోడ్పాటు అందించింది.

ఎన్‌క్యాష్‌తోపాటు క్యాష్‌ఫ్రీ పేమెంట్స్‌, ఓపెన్, రేజర్‌పే వంటి ఇతర ఫిన్‌టెక్ స్టార్టప్‌లకు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  పేమెంట్‌ అగ్రిగేటర్ లైసెన్స్‌లను మంజూరు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top