టెస్లా సైబర్‌ట్రక్‌ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్ | Sakshi
Sakshi News home page

టెస్లా సైబర్‌ట్రక్‌ పక్కన సౌదీ ప్రిన్స్.. మస్క్ ట్వీట్ వైరల్

Published Sat, May 18 2024 6:12 PM

Elon Musk Reacts to Saudi Prince Photo With Cybertruck

సౌదీ యువరాజు 'తుర్కీ బిన్ సల్మాన్ అల్ సౌద్' టెస్లా సైబర్‌ట్రక్‌ పక్కన నిలబడి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటో సాధారణ నెటిజన్లను మాత్రమే కాకుండా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను (Elon Musk) కూడా ఆకర్శించింది.

నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఫోటోను మస్క్ రీ ట్వీట్ చేస్తూ 'కూల్' అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ పోస్టుకు వేలసంఖ్యలో లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.

టెస్లా సైబర్ ట్రక్
టెస్లా సైబర్‌ట్రక్‌ విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర 60990 డాలర్లు (రూ. 50.83 లక్షలు), హై వేరియంట్ ధర 99,990 డాలర్లు (రూ. 83.21 లక్షలు). ఇది డ్యూయెల్, ట్రై మోటర్ అనే రెండు ఆప్షన్లలలో లభిస్తుంది. డ్యూయెల్ మోటార్ 600 బీహెచ్‌పీ పవర్, ట్రై మోటార్ 845 బీహెచ్‌పీ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

డ్యూయెల్ మోటార్ మోటార్ 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ, ట్రై మోటార్ మోడల్ 2.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. టెస్లా సైబర్‌ట్రక్‌ రేంజ్ 547 కిమీ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ ట్రక్ మంచి డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.

Advertisement
 
Advertisement
 
Advertisement