హాట్‌ కేకుల్లా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అమ్మకాలు.. మరీ ఈ రేంజ్‌లోనా!

Electric Vehicle Retails Reached 4,29,217 Units In 2021-22 - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. ఏకంగా మూడు రెట్లు పెరిగాయి. 2020–21లో ఈవీల అమ్మకాలు 1,34,821 యూనిట్లుగా ఉండగా 2021–22లో 4,29,217 యూనిట్లకు ఎగిశాయి. 2019–20లో అమ్మకాలు 1,68,300 యూనిట్లు. ఆటోమొబైల్‌ డీలర్ల సమాఖ్య ఎఫ్‌ఏడీఏ విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ టూవీలర్ల విక్రయాలు భారీగా పెరిగాయి. 

41,046 యూనిట్ల నుంచి 2,31,338 యూనిట్లకు ఎగిశాయి. 65,303 వాహనాలతో 28.23 శాతం మార్కెట్‌ వాటాతో హీరో ఎలక్ట్రిక్‌ అగ్రస్థానంలో నిల్చింది. ఎలక్ట్రిక్‌ ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు 4,984 యూనిట్ల నుంచి 17,802 యూనిట్లకు పెరిగాయి. టాటా మోటర్స్‌ 15,198 వాహనాల విక్రయాలు, 85.37 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. 

ఎఫ్‌ఏడీఏ లెక్కల ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్‌ త్రీ వీలర్ల అమ్మకాలు 88,391 నుంచి రెట్టింపై 1,77,874 యూనిట్లకు చేరాయి. ఎలక్ట్రిక్‌ వాణిజ్య వాహనాల విక్రయాలు 400 యూనిట్ల నుంచి 2,203 యూనిట్లకు పెరిగాయి. 1,605 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు ఉండగా.. 1,397 ఆఫీసుల నుంచి ఎఫ్‌ఏడీఏ ఈ డేటా సేకరించింది.

చదవండి: 11ఏళ్ల కష్టానికి ఫలితం, దేశీ స్టార్టప్‌కు యూరప్‌ నుంచి భారీ డీల్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top