పేస్ట్‌, సబ్బు, ఫేస్‌పౌడర్‌లు సప్లయ్‌ బంద్‌! ఏయే రాష్ట్రాల్లో అంటే..

Distributors Block HUL Colgate Products Over Price Margin Issue - Sakshi

ఎఫ్‌ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్‌ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది.  రిటైల్‌ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది.

ఎఫ్‌ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్‌, ఒడిషా, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్‌ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్‌ఇండియా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్‌ యునిలివర్‌ ఉత్పత్తులైన పౌడర్‌, సబ్బులు, హెయిర్‌ ఆయిల్‌, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్‌ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి.  బ్యాక్‌ టు బ్యాక్‌ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్‌. జియోమార్ట్‌, మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీ, ఉడాన్‌, ఎలాస్టిక్‌ రన్‌, వాల్‌మార్ట్‌)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్‌ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్‌ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్‌ చేస్తున్నారు. 

రిటైల్‌ మార్జిన్‌ 8-12 శాతం ఉండగా, ఆన్‌లైన్‌ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్‌ యునిలివర్‌ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్‌  కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు.

మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని  తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్‌ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్‌ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది.

సంబంధిత వార్త: కోల్గేట్‌ పేస్ట్‌ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top