breaking news
Rate concern
-
పేస్ట్, సబ్బు, ఫేస్పౌడర్లు బంద్.. మరో నాలుగు రాష్ట్రాలకు!
ఎఫ్ఎంసీజీ (Fast-moving consumer goods) ఉత్పత్తులపై మార్జిన్ విషయమై పంపిణీదారుల్లో అసంతృప్తి పెల్లుబికుతోంది. రిటైల్ ధరలకు, బీ2బీ కంపెనీలకు వేర్వేరు రేట్లపై నిరసన.. క్రమక్రమంగా దేశం మొత్తం విస్తరిస్తోంది. ఇదివరకే మహారాష్ట్ర పంపిణీదారులు కొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అది మరికొన్ని రాష్ట్రాలకు పాకింది. ఎఫ్ఎంసీజీ పంపిణీదారుల సెగ మరో నాలుగు రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలు జనవరి 4వ తేదీ నుంచి సప్లయ్ నిలిపివేయాలని ఆయా రాష్ట్రాల పంపిణీదారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆల్ఇండియా కన్జూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఒక స్పష్టమైన ప్రకటన సైతం విడుదల చేసింది. హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తులైన పౌడర్, సబ్బులు, హెయిర్ ఆయిల్, షాంపూ ప్రొడక్టులతో కోల్గేట్ సంబంధిత ఉత్పత్తులు ఈ లిస్టులో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ కంపెనీలది ఒక ఆర్గనైజ్డ్‌ఛానెల్. జియోమార్ట్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ, ఉడాన్, ఎలాస్టిక్ రన్, వాల్‌మార్ట్)లాంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వాటికి ఎలాంటి పంపిణీ మార్జిన్ ఇస్తున్నారో.. తమకూ అదే మార్జిన్ ఇవ్వాలంటూ పంపిణీదారులు డిమాండ్ చేస్తున్నారు. రిటైల్ మార్జిన్ 8-12 శాతం ఉండగా, ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్లకు.. బీ2బీ స్టోర్స్‌కు 15-20 శాతం ఉంటోందని పంపిణీదారులు ఆరోపిస్తుండగా.. అలాంటిదేం లేదని ఆయా కంపెనీలు చెప్తున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో పంపిణీదారులు హిందుస్థాన్ యునిలివర్ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేశారు. ఆపై జనవరి 1వ తేదీ నుంచి కోల్గేట్ కోల్గేట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తులను సైతం ఆపేశారు. దీంతో పేస్టుల కొరత ఏర్పడొచ్చన్న కథనాల మేరకు జనాలకు ఎగబడి కొంటున్నారు. మరోవైపు చర్చలు జరిపిన మరికంపెనీల నుంచి కూడా సరైన స్పందన లేకుండా పోయింది. సహయక నిరాకరణ చేపడతామని తాము ముందస్తు సంకేతాలు ఇచ్చినప్పటికీ.. ఎఫ్ఎంసీజీ కంపెనీల నుంచి సరైన స్పందన లేదని పంపిణీదారుల అసోషియేషన్ గుర్రుగా ఉంది. ఈ తరుణంలో సోమవారం జరగబోయే చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఒకవేళ ఈ చర్చలు గనుక విఫలమైతే.. మరికొన్ని కంపెనీల ఉత్పత్తుల పంపిణీని నిలిపివేయాలన్న ఆలోచనలో All India Consumer Product Distributors Federation ఉంది. సంబంధిత వార్త: కోల్గేట్ పేస్ట్ కోసం క్యూ కడుతున్న జనం! కారణం ఏంటంటే.. -
పసి ప్రాణాలు పుటుక్కు..!
సాక్షి, గుంటూరు :జిల్లాలో శిశు మరణాల రేటు ఆందోళన కలిగిస్తోంది. ప్రతి రోజూ కొన్ని వేల మంది చిన్నారులు విరేచనాలు, ఊపిరితిత్తుల వ్యాధు లతో మరణిస్తున్నారు. పుట్టిన వెయ్యిమంది పసికందుల్లో 60 మంది ఏడాదిలోపు చనిపోతుంటే, మిగిలిన వారిలో సగం మంది పోషకాహార లోపంతో మృత్యువాత పడుతున్నారు. శిశు మరణాల రేటును తగ్గించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఆర్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.కోట్లు కేటాయిస్తున్నా, నిధులను సరిగా ఖర్చు చేయడంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద కేటాయిస్తున్న నిధులలో సింహభాగం సిబ్బంది జీతభత్యా లకు ఖర్చు చేస్తున్నారే తప్ప చిన్నారుల ఆరోగ్యం మెరుగుకు ప్రణాళికలేవీ రూపొందించడం లేదు. శిశు మరణాల రేటు ప్రస్తుతమున్న 42.1 నుంచి 20 లోపుగా ఎన్హెచ్ఆర్ఎం కింద తగ్గించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యాల్ని నిర్ధేశించినా వైద్య ఆరోగ్య శాఖ పెడచెవిన పెడుతోంది. ముఖ్యంగా గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్)లో శిశు మరణాలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. జీజీహెచ్‌లో వైద్యం కోసం చేరుతున్న చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జిల్లాలో 2012లో 3,015 మందిని వైద్యం కోసం చేర్పిస్తే, 955 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. 2013లో 2,902 మందిని చేర్పించగా, 902 మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు. దీనిపై పలు ప్రజా సంఘాలు ఆందోళనలు, ఫిర్యాదులు చేశాయి. శిశు మరణాలపై సమగ్ర విచారణ జరిపి ఫిబ్రవరి 13లోగా నివేదిక సమర్పించాలని కలెక్టరుతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు మానవ హక్కుల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నారుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే! శిశు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలేనని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీజీహెచ్‌లో శిశు సంరక్షణకు అనువైన సౌకర్యాలు కానీ, మౌలిక సదుపాయాలేవీ లేవు. అధునాతన పరికరాలు కూడా లేకపోవడంతో చిన్నారుల మరణాల రేటు అధికంగా ఉంది. వార్మర్లు, ఫొటోథెరపి యూనిట్లు, వెంటిలేటర్లు వంటి పరికరాలు లేవు. ముఖ్యంగా వైద్యుల కొరత తీవ్రంగా ఉంది. చిన్నారుల నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసియూ)లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కో పడకకు ఒక్కో నర్సు అందుబాటులో ఉండాలి. కానీ పదిహేను పడకలకు ఒక్క నర్సు మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్రం విడుదల చేసిన రూ.20 కోట్ల నిధులతో జీజీహెచ్ ఆవరణలోనే మాతా శిశు సంరక్షణ నిమిత్తం ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు ఇటీవలే జిల్లా కలెక్టరు ఎస్.సురేశ్‌కుమార్ ప్రకటించారు. పునరుత్పత్తి, శిశు ఆరోగ్యం కింద మంజూరు, ఖర్చుల వివరాలివే.. సంవత్సరం మంజూరు ఖర్చు 2005-06 1.16 కోట్లు 1.10 కోట్లు 2006-07 2.42 కోట్లు 2.35 కోట్లు 2007-08 2.67 కోట్లు 2.40 కోట్లు 2008-09 2.80 కోట్లు 2.72 కోట్లు 2009-10 3.02 కోట్లు 2.80 కోట్లు 2010-11 3.27 కోట్లు 3.05 కోట్లు 2011-12 3.48 కోట్లు 3.12 కోట్లు 2012-13 3.62 కోట్లు 3.27 కోట్లు