ఉద్యోగుల్ని ఊరిస్తున్న ఇంక్రిమెంట్లు..ఎంతపెరగనున్నాయంటే!!

Deloitte Estimates Increments To Go Up To 9.1percent In 2022 - Sakshi

ఈ ఏడాది దేశంలో పెరగనున్న ఉద్యోగుల జీతాలపై డెలాయిట్ టచ్ తోమట్సు ఇండియా Deloitte Touche Tohmatsu ఎల్‌ఎల్‌పీ (డీటీటీఐఎల్‌ఎల్‌పీ) స్పందించింది. 2021తో పోలిస్తే ఈ ఏడాది 92శాతంతో వేతనాలు పెరుగుతున్నట్లు తెలిపింది. ఇక గతేడాది పెరిగిన జీతాలు 8శాతం నుంచి 9.1శాతానికి పెరగనున్నట్లు అంచనా వేసింది.  

సర్వే ఫలితాల ప్రకారం, దాదాపు అన్ని సంస్థలు 2022లో ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2020, 2021పెరిగిన జీతాలు 60శాతంతో పోలిస్తే 2022లో 92శాతం పెరగనున్నట్లు తెలిపింది. 2022లో పెరగనున్న 2021లో 8.0శాతం పోలిస్తే 9.1శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022 అంచనా వేసిన ఇంక్రిమెంట్ 2019లో కోవిడ్-19కి ముందు పెరిగిన ఇంక్రిమెంట‍్ల కంటే 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్‌) ఎక్కువగా ఉంది.

స్టడీ వర్క్‌ ఫోర్స్ అండ్ ఇంక్రిమెంట్ ట్రెండ్స్ సర్వే -2022 మొదటి దశ అంచనా ప్రకారం 34శాతం సంస్థలు రెండంకెల సగటు ఇంక్రిమెంట్‌లను ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాయి. 2021లో 20శాతం ఉండగా..2020లో 12శాతం మాత్రమే ఉన్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగాలు 2022లో అత్యధిక ఇంక్రిమెంట్‌లను అందించే అవకాశం ఉంది. ఫిన్‌టెక్, ఐటీ-ఉత్పత్తి కంపెనీలు,డిజిటల్/ఇ-కామర్స్ సంస్థలు 2022లో రెండంకెల ఇంక్రిమెంట్‌లను ఇస్తాయని భావిస్తున్నారు. జూనియర్ మేనేజ్‌మెంట్‌లోని ఉద్యోగులు సగటున 2022లో రెండంకెల పెంపును అందుకోవచ్చని భావిస్తున్నారు.

92శాతం సంస్థలు వ్యక్తిగత పనితీరును బట్టి ఉద్యోగుల మధ్య ఇంక్రిమెంట్‌లను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. పనితీరు బాగున్న ఉద్యోగులకు నామమాత్రంగా పని చేసే ఉద్యోగుల కంటే 1.7రెట్లు ఇంక్రిమెంట్‌ పొందవచ్చని భావిస్తున్నారు. పదోన్నతి పొందే ఉద్యోగుల శాతం 2021లో 11.7శాతం నుండి 2022లో 12.4శాతానికి పెరుగుతుందని, 2022లో పదోన్నతి పొందిన వారికి సగటు అదనపు ఇంక్రిమెంట్ 7.5శాతం ఉండనుంది.

చదవండి: ప్రైవేట్ ఉద్యోగుల పంట పండింది!! భారీగా పెర‌గ‌నున్న జీతాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top