
హైదరాబాద్: టాటా గ్రూపు ఎలక్ట్రానిక్స్ రిటైల్ కంపెనీ ‘క్రోమా’ వింటర్ సీజన్ ఆఫర్లను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్లూటూత్ స్పీకర్లు, ఏసీలు, పవర్ బ్యాంక్‌లు, ఎయిర్ ప్యూరిఫయర్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. అన్ని క్రోమా స్టోర్లు, క్రోమా ఆన్‌లైన్ పోర్టల్‌లో కొనుగోళ్లపై ఈ ఆఫర్లను పొందొచ్చని పేర్కొంది.
బ్యాక్ ప్యాక్‌లపై 70 శాతం వరకు, ఇయర్ ఫోన్‌లపై 80 శాతం వరకు రాయితీ, నెక్ పిల్లో, ఐమాస్కస్, ట్రావెల్ బ్యాగ్ వంటి ట్రావెల్ యాక్సెసరీలపై 5 శాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదనంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. (గుడ్‌న్యూస్..ఈ ఐటీ కంపెనీలో కొలువులే కొలువులు)
రూం హీటర్లు కేవలం 699తో ప్రారంభం. ఇన్‌స్టంట్ గీజర్‌లు ధరలు 799 నుండి ప్రారంభం. ఫిలిప్స్ ఎయిర్‌ఫ్రైయర్స్, కెటిల్స్ , కన్వెక్షన్ మైక్రోవేవ్ తదితర వింటర్ సీజన్‌కు సంబంధించిన ఉత్పత్తులపై ఆఫర్లను అందిస్తోంది.