రెస్టారెంట్‌ సర్వీసుల్లో జీఎస్‌టీపై స్పష్టత | Clarification GST On Restaurant Services | Sakshi
Sakshi News home page

రెస్టారెంట్‌ సర్వీసుల్లో జీఎస్‌టీపై స్పష్టత

Mar 29 2025 2:01 PM | Updated on Mar 29 2025 2:53 PM

Clarification GST On Restaurant Services

న్యూఢిల్లీ: రెస్టారెంట్ల సర్వీసులపై విధించే జీఎస్‌టీపై కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనిచ్చింది. రోజుకు రూ.7,500 పైగా గది అద్దెను వసూలు చేసే హోటళ్లలో, రెస్టారెంటు సర్వీసులపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌తో (ఐటీసీ) 18 శాతం జీఎస్‌టీ వర్తిస్తుందని తెలిపింది. అంతకన్నా తక్కువ అద్దె ఉండే హోటళ్లలో ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్‌టీ యథాతథంగా కొనసాగుతుందని వివరించింది. దీనికి క్రితం ఆర్థిక సంవత్సరం వసూలు చేసిన అద్దె ప్రాతిపదికగా ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement