
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎండబ్ల్యూ'.. భారతదేశంలో ఇప్పటి వరకు 5,000 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో ఆరు EVలను విక్రయిస్తున్న సంస్థ.. నవంబర్ 2021లో iXతో దేశీయ లగ్జరీ ఈవీ రంగంలోకి ప్రవేశించింది.
కార్ల అమ్మకాలను మాత్రమే కాకుండా.. బీఎండబ్ల్యూ 4,000 కి.మీ పవర్ ఛార్జింగ్ కారిడార్ కూడా ప్రారంభించింది. కంపెనీ ఛార్జింగ్ కారిడార్ జమ్మూ నుంచి మధురై వరకు విస్తరించి, జాతీయ రహదారులు & ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పూణే, బెంగళూరు, కోయంబత్తూర్, మధురై వంటి నగరాలను కవర్ చేస్తుంది. ఇది 120 kW నుంచి 720 kW వరకు సామర్థ్యాలతో ఛార్జర్‌లను కలిగి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 6000 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు సమాచారం. బీఎండబ్ల్యూ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం మైబీఎండబ్ల్యూ యాప్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు.
మూడు శాతం పెరిగిన బీఎండబ్ల్యూ ధరలు
బీఎండబ్ల్యూ.. భారతదేశంలోని తన మొత్తం వాహనాల ధరలను 2025 సెప్టెంబర్ 1 నుంచి 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. నిరంతర విదేశీ మారక ద్రవ్య హెచ్చుతగ్గులు & ప్రపంచ సరఫరా గొలుసు ఒత్తిళ్ల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.