ఎంబసీ రీట్‌ నుంచి బ్లాక్‌స్టోన్‌ ఔట్‌

Blackstone exit from Embassy Office Parks REIT - Sakshi

న్యూఢిల్లీ: లిస్టెడ్‌ సంస్థ ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌(రీట్‌) నుంచి గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్లాక్‌స్టోన్‌ వైదొలగినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌లో తమకుగల మొత్తం 23.5 శాతం వాటాను విక్రయించినట్లు వెల్లడించాయి.

ఒక్కో షేరుకి రూ. 316 సగటు ధరలో వాటా విక్రయాన్ని చేపట్టినట్లు తెలిపాయి. బుధవారం ముగింపు ధర రూ. 331తో పోలిస్తే ఇది 5 శాతం డిస్కౌంట్‌కాగా.. తద్వారా బ్లాక్‌స్టోన్‌ రూ. 7,100 కోట్లు సమకూర్చుకున్నట్లు అంచనా. ఈ బ్లాక్‌డీల్స్‌లో ఏడీఐఏసహా ప్రస్తుత యూనిట్‌ హోల్డర్లు, ఎస్‌బీఐ ఎంఎఫ్‌ తదితర కొత్త ఇన్వెస్టర్లు షేర్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూప్‌ సంయుక్తంగా ప్రమోట్‌ చేసిన ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ దేశీయంగా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన తొలి రీట్‌గా నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2019లో చేపట్టిన ఐపీవోలో భాగంగా రూ. 5,000 కోట్ల సమీకరణ ద్వారా లిస్టయ్యింది. సంస్థలో దేశీ ఎంబసీ గ్రూప్‌నకు సుమారు 8 శాతం వాటా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top