
హైదరాబాద్: అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ క్యాంపస్‌లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అత్యంత సందడిగా జరిగింది. పీజీడీఎం 2025–27 బ్యాచ్‌కు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం సాగింది. అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తి, నైతికత, అభ్యాసం వంటి గుణాలను అలవర్చుకోవాలని విద్యార్థులను కోరారు.
అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ వివిధ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. అవగాహన ఒప్పందాలు చేసుకున్న సంస్థలు డిప్లమేటిక్ క్లబ్, మీస్కూల్, ట్రిగునిటా ఎడ్టెక్, ఏఐఈఎస్ఈసీ ఉన్నాయి. ఇవి విద్యార్థులకు సాంస్కృతిక మార్పిడి, ప్రయోగాత్మక స్టార్టప్ అనుభవం, సృజనాత్మక వృత్తి మార్గాల తలుపులు తెరవనున్నాయి.
ఈ సందర్భంగా అశోక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అకడమిక్ హ్యాండ్‌బుక్, అరోహన్ 2025 పేరుతో 30 రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఏ-హబ్ యాక్టివిటీలను డాక్టర్ సబిత (సీఐఓ) పరిచయం చేశారు. టీమ్ పరిచయాన్ని డీన్ డాక్టర్ స్వాతి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అశోక్ నొముల తదితరులు పాల్గొన్నారు.