సూపర్‌ ఆఫర్‌: ఐపోన్‌13పై ఏకంగా రూ. 36వేల డిస్కౌంట్‌

Apple iPhone13 available at Rs 25900 on Flipkart  - Sakshi

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ ప్రకారం 'బెస్ట్ సెల్లర్' ఐఫోన్ 13పై దాదాపు 36వేల దాకా తగ్గింపుతో రూ.25,900కి వినియోగదారులు సొంతం చేసుకోవచ్చు. యాపిల్‌ ఐఫోన్‌ 14 ను పోలిన స్పెసిఫికేషన్సే ఐఫోన​ 13లో కూడా ఉన్నాయి. 2021లో లాంచ్‌ అయినపుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 79,900. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 36,099 తగ్గింపు తర్వాత రూ. 25,900కి అందుబాటులో ఉంది. (తక్కువ ధరలో ఏథర్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్‌, ధర ఎంతంటే?)

ప్రస్తుతం రూ. 7,901 తగ్గింపుతో  రూ. 61,999 వద్ద లిస్ట్‌ అయింది. అయితే కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రూ. 33 వేల దాకా ఎక్స్ఛేంజ్ ఆపర్‌ కూడా లభ్యం. ఈ ఆఫర్లన్నీ వర్తిస్తే యాపిల్‌ ఐఫోన్‌ 13 రూ. 25,900కే సొంతం చేసుకోవచ్చు. (మస్క్‌కు మరో ఝలక్‌: కీలక ఎగ్జిక్యూటివ్‌ గుడ్‌బై)

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్‌ 
6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే
A15 బయోనిక్ చిప్‌సెట్ 
12 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా 
12 ఎంపీ సెల్ఫీ కెమెరా
3227 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

ఇదీ చదవండిఅంబానీ మనవరాలంటే అట్లుంటది! పాపాయి పేరు, రాశి ఇదేనట? 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top