
సుమారు రూ. 20,000 కోట్ల భారతీయ డిఫెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) మార్కెట్‌లో విస్తరణపై రిలయన్స్ డిఫెన్స్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన కోస్టల్ మెకానిక్స్‌తో చేతులు కలిపింది. భారతీయ సాయుధ బలగాలకు అవసరమైన ఎంఆర్‌వో, అప్‌గ్రేడ్, లైఫ్‌సైకిల్ సపోర్ట్ సొల్యూషన్స్‌ను అందించడంపై ఫోకస్ చేయనున్నట్లు రిలయన్స్ డిఫెన్స్ మాతృ సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది.
100కు పైగా జాగ్వార్ ఫైటర్ విమానాలు, 100 పైచిలుకు మిగ్–29 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అపాచీ ఎటాక్ హెలికాప్టర్లు, ఎల్–70 ఎయిర్ డిఫెన్స్ గన్‌లు మొదలైన వాటి ఆధునీకరణకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వివరించింది. డీల్ ప్రకారం భారత్‌తో పాటు ఎగుమతి మార్కెట్లలోని క్లయింట్లకు సేవలు అందించేందుకు రిలయన్స్ డిఫెన్స్, కోస్టల్ మెకానిక్స్ కలిసి మహారాష్ట్రలో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తాయి.
దీనితో సాయుధ బలగాలు ఉపయోగించే గగనతల, భూతల డిఫెన్స్ ప్లాట్‌ఫాంల నిర్వహణ, అప్‌గ్రేడ్ సర్వీసులను అందించనున్నట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రా పేర్కొంది. 1975లో ఏర్పాటైన కోస్టల్ మెకానిక్స్‌కు అమెరికా ఎయిర్‌ఫోర్స్, ఆరీ్మకి కీలక పరికరాలను సరఫరా చేస్తోంది.