ట్రంప్‌ టవర్స్‌లోకి రణబీర్‌ అండ్‌ అలియా:అద్దె ఎంతో తెలిస్తే షాక్‌వుతారు

Actor Ranbir Kapoor rents 7000 sq ft apartment in TrumpTowers Pune - Sakshi

బాలీవుడ్ స్టార్ కపుల్‌ రణబీర్ కపూర్ అలియా భట్‌ పూణెలోని ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారన్న వార్తలు మీడియాలో సందడి చేస్తున్నాయి. పూణేలోని  ట్రంప్ టవర్స్‌లోని దాదాపు 7,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌కు వార్షిక అద్దెగా రూ. 48 లక్షలకు లీజుకు తీసుకున్నారని సమాచారం.  బాలీవుడ్‌ హీరోయిన్‌  అలియా భట్‌తో కలిసి ఇటీవల న్యూయార్క్ నుండి తిరిగి  వచ్చిన రణబీర్‌  ఈ అపార్ట్‌మెంట్‌ లీజ్‌కు తీసుకోవడం వార్తల్లో నిలిచింది.  (ఫెస్టివ్‌ సీజన్‌: బంగారం, వెండి ధరలు, ఎన్నాళ్లీ ఒత్తిడి!)

పూణేలోని కళ్యాణి నగర్‌లోని ట్రంప్ టవర్స్‌లోని 10వ అంతస్థులో ఉన్న రెసిడెన్షియల్ యూనిట్‌ని మూడు సంవత్సరాల పాటు నెలవారీ అద్దెకు రూ. 4 లక్షలు చెల్లించేలా  డీల్‌ కుదుర్చుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ల ప్రకారం, అపార్ట్‌మెంట్‌ను పూణేకు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ అండ్‌ వెహికల్ కాంపోనెంట్ పరిశ్రమలోని ప్రముఖ తయారీదారు డ్యూరోషాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి అద్దెకు తీసుకున్నారు. లీజు అండ్‌ లైసెన్స్ ఒప్పందంపై సెప్టెంబర్ 15, 2023న సంతకం చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా రూ. 24 లక్షల రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌కూడా చెల్లించారు. మొదటి ఏడాది రూ.4 లక్షలు, రెండో ఏడాది రూ.4.2 లక్షలు, మూడో ఏడాది నెలకు రూ.4.41 లక్షలు నెలవారీ అద్దె చెల్లించాల్సి ఉంటుంది.  (పరిణీతి-రాఘవ్‌ చద్దా వెడ్డింగ్‌: ఒక్క నైట్‌కి హోటల్‌ సూట్‌ ఖర్చు ఎంతంటే?)

మరోవైపు రణబీర్ అప్‌కమింగ్‌ మూవీ యానిమల్ డిసెంబరు 1న రిలీజ్‌కు సిద్ధంగా  ఉంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు రణబీర్‌.  ఈ సినిమాలో  రష్మిక మందన్న, బాబీ డియోల్ , అనిల్ కపూర్ కూడా నటించారు. గత ఏడాది ప్రేమ వివాహం చేసుకున్న రణబీర్ ,అలియా భట్  రాహా అనే కుమార్తె ఉంది. 

కాగా  బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో నెలకు దాదాపు రూ. 1.5 లక్షల అద్దెకు మూడేళ్లపాటు ఒక ఫ్లాట్‌ను లీజుకు తీసుకున్నాడు.  పూణేలోని ఈ జంట టవర్లు ఇండియాలో  తొలి ట్రంప్‌ టవర్స్‌. 23 అంతస్తుల ఈ  ట్రంప్ టవర్లను అతుల్ చోర్డియా నేతృత్వంలోని పంచశిల్ రియాల్టీ అభివృద్ధి చేసింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top