
అమెరికాలో చిన్నవయసులోనే స్టార్టప్‌కి సీఈవో, 15 ఏళ్ల ఎరిక్ ఝూకు వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్‌లో చోటు దక్కలేదు. లింక్డ్‌ఇన్‌లో తననుఎందుకు బ్యాన్ చేసిందో, అకౌంట్ ఎందుకు లేదో తెలుపుతూ స్వయంగా అవియాటో సీఈవో ఎరిక్ తన ట్విటర్ హ్యాండిల్‌లో ప్రకటించారు. దీంతో 6 లక్షలకు పైగా వ్యూస్, దాదాపు 4వేలకు పైగా లైక్స్‌తో ఈ ట్వీట్ వైరలయింది. విషయం ఏమిటంటే...
హైస్కూల్‌లో చదువుతున్న ఎరిక్ ‘ఎవియాటో’ అనే స్టార్టప్‌ని ఏర్పాటు చేశాడు. బాచ్‌మానిటీ క్యాపిటల్‌లో పెట్టుబడిదారుడిగా కూడా ఉన్నాడు. ఈ కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన ఒక ఉద్యోగి “హే ఎరిక్, నేను మీ కంపెనీతో నా ఉద్యోగంపై సంతోషిస్తున్నా. కానీ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో మిమ్మల్ని ట్యాగ్ చేయలేకపోయాను, కానీ.. అంటూ వచ్చిన ఒక స్క్రీన్ షాట్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ అసలు విషయం చెప్పారు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. దాదాపు ఇదే కారణంతో స్పేస్‌ఎక్స్ కైరన్ క్వాజీకి లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
లింక్డ్‌ఇన్ ఖాతాను తెరవాలంటే కనీసం 16 ఏళ్ల వయసుండాలి. ఈ విషయాన్ని తన కంపెనీ కొత్త ఉద్యోగికి చెప్పాల్సి వచ్చిందంటూ ట్వీట్ చేశారు. అలాగే దీనికి సంబంధించి వయసు నిబందనపై లింక్డ్‌ఇన్ ప్రతినిధి ఫోటోను కూడా షేర్ చేశారు. దీంతో ఇది ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది.
I had to tell my new employee that I got banned from linkedin for being 15 years old today… pic.twitter.com/fskiVDnpWw
— Eric Zhu (@ericzhu105) June 15, 2023