ఏఐటీయూసీ జాతీయ సమితిలో స్థానం | - | Sakshi
Sakshi News home page

ఏఐటీయూసీ జాతీయ సమితిలో స్థానం

Nov 27 2026 1:08 AM | Updated on Nov 27 2026 1:08 AM

బోనకల్‌/ములకలపల్లి/సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఏఐటీయూసీ జాతీయ సమితిలో సభ్యులుగా ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి స్థానం దక్కింది. బెంగళూరులో ఈనెల 22నుంచి జరుగుతున్న ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా బోనకల్‌ మండలం రాపల్లి గ్రామానికి చెందిన తోట రామాంజనేయులు, ములకలపల్లికి చెందిన నరాటి ప్రసాద్‌తో పాటు కంచర్ల జమలయ్య సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో జమలయ్య, ప్రసాద్‌ ప్రస్తుతం ఏఐటీయూసీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. ఈమేరకు వీరి నియామకంపై సీపీఐ, కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

డీసీసీబీ సీఈఓగా

‘కూరపాటి’

ఖమ్మంవ్యవసాయం: జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) నూతన సీఈఓగా కూరపాటి ఉమామహేశ్వరరెడ్డిని సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఈమేరకు ఆయన వివరాలతో సీల్డ్‌ కవర్‌ను బ్యాంక్‌ పర్సన్‌ ఇన్‌చార్జి, కలెక్టర్‌కు పంపించింది. కలెక్టర్‌తో కూడిన త్రీమెన్‌ కమిటీ వివరాలను మరోమారు పరిశీలించాక రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కి ప్రవాహ్‌ పోర్టల్‌లో పంపించాల్సి ఉంది. ఆపై ఆర్‌బీఐ అనుమతితో పేరు అధికారికంగా ప్రకటిస్తారు. కాగా, ఉమామహేశ్వరరెడ్డి ప్రస్తుతం ఏపీలోని కర్నూలు జిల్లా డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీజీఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి

పాల్వంచ: రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాల పాలై మృతి చెందింది. బూర్గంపాడు మండలం పినపాక పట్టీనగర్‌కు చెందిన జి.అగ్నిశ్వరమ్మ(70) పాల్వంచ ఇందిరా కాలనీలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గురువారం వచ్చింది. ఆమె బీసీఎం రోడ్డు దాటుతుండగా ఓ కారును ఓవర్‌ టేక్‌ చేయబోయిన మరో కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.

అడవి మాంసం కలిగిన ముగ్గురి అరెస్ట్‌

దమ్మపేట: అడవి పంది మాంసం కలిగిన ముగ్గురిని అటవీ శాఖ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాస్‌ తెలిపిన వివరాలు... దమ్మపేట ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధి తిరుమలకుంట బీట్‌లో తనిఖీలు తనిఖీ చేస్తుండగా అశ్వారావుపేట మండలంలోని తిరుమలకుంటకు చెందిన కారం రాంబాబు వ్యవసాయ భూమిలో 1.5 కిలోల అడవి పంది మాంసంతో ముగ్గురు పట్టుబడ్డారు. వీరు తిరుమలకుంటకు చెందిన కారం రాంబాబు, కోర్సగూడెంకు చెందిన మొడియం వెంకటేష్‌, బోరియాలగుట్టకు చెందిన మడకం ముత్యాలరావుగా గుర్తించారు. రాంబాబు భూమిలోకి ప్రవేశించిన అడవి పందిని పెంపుడు కుక్కలు తరిమి చంపాయని, కుక్కలు తిని వదిలేసిన మాంసాన్ని పంచుకున్నట్టు నిందితులు అంగీకరించారని ఎఫ్‌ఆర్‌ఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement