దుమ్ముగూడెం : మండలంలోని చింతగుప్ప గ్రామానికి చెందిన ఆదివాసీ అక్కాచెల్లెళ్లు పొడియం సుగుణ (అండర్–17), పొడియం అనుష (అండర్–14) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. వారికి నరసాపురం గ్రామంలోని శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ చిన్న అరుణాచలం ట్రస్ట్ వ్యవస్థాపకులు శివ నాగస్వామి రూ.10,000, బీజేపీ నాయకుడు కుంజా ధర్మా రూ.1,000 ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు పొడియం రామమ్మ, పొడియం ముత్తయ్య, కుంజా సంతోష్, పూనెం రవీందర్, నంద్యాల బాలకృష్ణ, సాయి కౌశిక్, సవలం వంశీ, కట్టం రాముడు, కోడి బాలయ్య, ఇరకం ఎర్రయ్య, తుర్రం ముద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.


