భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం రామసేవా మండపంలో కొలువుదీర్చి స్వామిరికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించిన అర్చకులు నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి అర్చకులు గురువారం సువర్ణ పుష్పార్చన పూజలు నిర్వహించారు. అమ్మవారికి 108 సువర్ణ పుష్పాలతో అర్చన చేయడమే కాక హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. ఈఓ విజయ్‌కుమార్, అర్చకులు, పద్మనాభశర్మ, ప్రసాద్‌శర్మ పాల్గొన్నారు.
స్కోచ్ అవార్డుకు ‘తెలంగాణ వన్ జీవనధార’ ప్రాజెక్ట్
చుంచుపల్లి: ప్రజల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణ, గిరిజనుల జీవనోపాధుల అభివృద్ధి లక్ష్యంగా ఖమ్మం అటవీ శాఖ చేపట్టిన ‘తెలంగాణ వన్ జీవనధార’ ప్రాజెక్ట్‌కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు నామినేషన్ లభించింది. గతంలో ఖమ్మం జిల్లా అటవీ అధికారిగా పనిచేసిన సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ రూపొందించిన ఈ కార్యక్రమం 2026 జనవరిలో ప్రారంభమైంది. వన సంరక్షణ సమితుల భాగస్వామ్యంతో అటవీ నిర్వహణ, వెదురు ఆధారిత పరిశ్రమలు, తేనెటీగల పెంపకం, నర్సరీలు, ఎకో టూరిజం ద్వారా గిరిజన, గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. స్కోచ్ అధికారిక ఎగ్జిబిషన్‌లో కమ్యూనిటీ ఆధారిత అటవీ నిర్వహణ విభాగంలో ప్రాజెక్ట్‌కు చోటు లభించింది. ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఈ తరహా కార్యక్రమాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ విస్తరించి వెదురు ఆధారిత పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
తూనికల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
జూలూరుపాడు: తూనికల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా తూనికల కొలత అధికారి కె.మనోహర్ హెచ్చరించారు. గురువారం జూలూరుపాడులోని వే బ్రిడ్జి కాంటాలు, పత్తి మార్కెట్ యార్డులోని ఎలక్ట్రానిక్ కాంటాలను తనిఖీ చేసి మాట్లాడారు. వే బ్రిడ్జి నిర్వాహకులు, ట్రేడర్లు, రైతులు పాల్గొన్నారు.
మార్క్‌ఫెడ్‌లో డీసీఎంఎస్ విలీనంపై రేపు మహాజన సభ
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్)ను మార్క్‌ఫెడ్‌లో విలీనం చేసే అంశంపై శనివారం మహాజన సభ నిర్వహిస్తున్నట్లు డీసీఎంఎస్ పర్సన్ ఇన్‌చార్జి, ఖమ్మం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం డీసీసీబీ కార్యాలయంలో జరిగే సభలో విలీనంపై సభ్యుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు వెల్లడించారు. సంస్థ ఆస్తులు, ఇతర అంశాలపై చర్చించడంతో పాటు సభ్యుల అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని పీఏసీఎస్‌ల చైర్మన్లు, బీ–క్లాస్ సభ్యులు, సహకార శాఖ అధికారులు హాజరుకావాలని అదనపు కలెక్టర్ సూచించారు.


