కమనీయం.. రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయం.. రామయ్య కల్యాణం

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి నిత్యకల్యాణం శనివారం కమనీయంగా జరి గింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్నన శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులకు కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.

అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు

కొత్తగూడెంఅర్బన్‌: బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం 12 రోజుల సెలవులు ప్రకటించింది. శనివారం నుంచి 21వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉండగా, 22 నుంచి కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయి. సెలవుల నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించే భోజనానికి బదులుగా ముందస్తుగానే టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) పంపిణీ చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు జిల్లాలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు తగిన సూచనలు చేయనున్నారు.

బాధితులకు

న్యాయం చేయాలి

ఎస్పీ రోహిత్‌ రాజు

దమ్మపేట: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చాలన ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశించారు. దమ్మపేట పోలీస్‌ స్టేషన్‌ను శని వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్‌ కేసులను సత్వరమే పరిష్కరించాలన్నారు. ఆధునిక సాంకేతికత, పోలీసింగ్‌ వెబ్‌ అప్లికేషన్లపై అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ప్రజలు సైబర్‌ నేరాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పెట్రోలింగ్‌, బ్లూ కోల్ట్స్‌ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

అటవీ శాఖ హెల్ప్‌లైన్‌ ప్రారంభం

చుంచుపల్లి: జిల్లాలో అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నేరాల నియంత్రణకు 24 గంటల కమాండ్‌ కంట్రోల్‌ హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమ చెట్ల నరికివేత, వన్యప్రాణుల వేట, అటవీ అగ్నిప్రమాదాలు, కలప అక్రమ రవాణా తదితర అంశాలపై 08744–295948 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భాగస్వామ్యంతో అటవీ సంరక్షణను పటిష్టం చేయవచ్చని పేర్కొన్నారు.

జమలాపురంలో

ప్రత్యేక పూజలు

ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని శ్రీవారి పాదంతో పాటు స్వామి మూలవిరాట్‌కు అర్చకులు పంచామృతంతో అభిషేకం చేశారు. ఆతర్వాత స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను పట్టువస్త్రాలతో అలంకరించి పెద్దసంఖ్యలో హాజరైన భక్తుల సమక్షాన నిత్యకల్యాణం, పల్లకీ సేవ నిర్వహించారు. ఈఓ జగన్మోహన్‌రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి

శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

స్వామి వారి ఆలయంలో ఆదివారం నుంచి 20వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు శనివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement