మండుటెండలో పూల అమ్మకాలు | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో పూల అమ్మకాలు

Oct 11 2026 12:15 AM | Updated on Oct 11 2026 12:15 AM

● చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు ● కార్పొరేషన్‌గా అప్‌గ్రేడైనా సౌకర్యాలు కల్పించని వైనం

● చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు ● కార్పొరేషన్‌గా అప్‌గ్రేడైనా సౌకర్యాలు కల్పించని వైనం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్‌ అయిన తర్వాత కొత్తగూడెంలో జరిగిన తొలి ఎన్నికల్లో సీపీఐకి మేయర్‌ పీఠం దక్కడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఫిబ్రవరి 16న మూడ్‌ గణేష్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కార్మికులు, కర్షకులు తమవాడు మేయర్‌ అయ్యాడని సంబరపడ్డారు. పదవీ బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడు నెలలు కావొస్తున్నా పరిపాలనపరంగా మెరుపులు నగరంలో కనిపించడం లేదు. కార్పొరేషన్‌ పాలకవర్గం చివరకు చిరు వ్యాపారుల సమస్యలను కూడా పరిష్కరించలేదు.

ఇక్కట్ల నడుమ..

బతుకమ్మ పండుగ సందర్భంగా బంతి, తంగేడు పూలు అమ్మేందుకు వచ్చిన చిరు వ్యాపారులు రాత్రి, పగలు సూపర్‌ బజార్‌ సెంటర్‌లో ఇబ్బందులు పడుతున్నారు. శనివారం మండుటెండలో గంటల తరబడి రోడ్ల పక్కన కూర్చుని పూలను విక్రయించారు. పూలు అమ్ముకుని కుటుంబాలను పోషించుకునే మహిళలకు కనీస రక్షణ, ప్రాథమిక గౌరవం ఇక్కడ కరువయ్యాయి. అయినా పొట్టకూటి కోసం, కుటుంబాలను పోషించుకునేందుకు వారు ఆ కష్టాలను లెక్క చేయడం లేదు. వినాయకచవితి, రాబోయే దసరా, దీపావళి, కార్తీక పౌర్ణమి, శివరాత్రి పండగల సమయంలో కూడా వారు ఇక్కట్లు పడుతున్నారు. నేషనల్‌ హైవే, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, 90 డిగ్రీల మూలమలుపు, ప్రధాన వాణిజ్య కూడలి కావడంతో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడి నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు చిరు వ్యాపారుల కోసం తాత్కాలిక మార్కెట్‌ ఏర్పాటు చేయడంతో అప్పటి మున్సిపాలిటీ ఇప్పటి కార్పొరేషన్‌లు దొందూ దొందే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement