పొసగడం లేదా ?! | - | Sakshi
Sakshi News home page

పొసగడం లేదా ?!

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

8లో ఎంపీ జోక్యం పార్టీని చూసుకోవద్దా? డీలిమిటేషన్‌పై ఆసక్తితో ? గతంలోనూ

న్యూస్‌రీల్‌

రాష్ట్రంలో మిత్రపక్షాలుగా

కాంగ్రెస్‌, సీపీఐ

కొత్తగూడెంలో మాత్రం

ఉప్పునిప్పులా వ్యవహారం

ఎంపీ పర్యటనలతో ఎమ్మెల్యే

కూనంనేని అసంతృప్తి

ఆటకు చోటేదీ.. ?
అశ్వారావుపేటలో ఈనెల 10నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు జరగనుండగా, ఆ స్థాయిలో ఏర్పాట్లు జరగడం లేదు.

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

రాష్ట్రంలో కాంగ్రెస్‌ – సీపీఐ మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. కానీ సీపీఐ ఎమ్మెల్యే కొనసాగుతున్న కొత్తగూడెంలో మాత్రం ఐక్యతకు బీటలు వారుతున్నాయనే చర్చ మొదలైంది. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో ఖమ్మం ఎంపీ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే అంశం ఆధారంగా ఈ వివాదం మొదలైంది.

– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం

ఎంపీ రామసహాయం

రఘురాంరెడ్డి

ఎమ్మెల్యే

కూనంనేని

ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి పార్లమెంట్‌ నియోజకర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే, ‘ఆయన కేవలం కొత్తగూడెంపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు.. తద్వారా కాంగ్రెస్‌ నుంచి నేనేదో లాక్కున్న ఫీల్‌ వస్తోంది’ అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ఖమ్మంలో జరిగిన మీట్‌ ది ప్రెస్‌లో వెల్లడించారు. దీంతో ఇంతకాలం తెరచాటుగా ఉన్న చర్చను ఒక్కసారిగా బహిరంగ వేదిక మీదకు తెచ్చినట్టయ్యింది. మిత్రపక్షాల మధ్యపైకి ఏకాభిప్రాయం ఉన్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా ఇబ్బందులు ఉన్నాయనే సంకేతాలు ఇకపై ఇరుపార్టీల క్షేత్రస్థాయి కేడర్‌కు చేరనున్నాయనే వాదన మొదలైంది.

ఖమ్మం పార్లమెంట్‌ పరిధిలో భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయాన పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును మిత్రపక్షమైన సీపీఐకి కేటాయించగా, అశ్వారావుపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి జారె ఆదినారాయణ గెలిచారు. దీంతో కొత్తగూడెం నుంచి ఎమ్మెల్యే స్థాయి ప్రొటోకాల్‌ కలిగిన నేతలెవరూ హస్తం పార్టీకి లేరు. పార్టీలో లెక్కకు మిక్కిలిగా నేతలు ఉన్నా ప్రభుత్వ పరంగా ప్రొటోకాల్‌ పదవులు తక్కువ మందికే దక్కాయి. పదవులు దక్కినవారు నియోజకర్గ స్థాయిలో పార్టీ కేడర్‌ను నడిపించే స్థితిలో లేరు. దీంతో ప్రభుత్వ పరంగా ప్రొటోకాల్‌ ఉన్న ఎంపీ రఘురాంరెడ్డి కొత్తగూడెం నియోజకర్గానికి ఎక్కువగా వస్తూ శ్రేణులకు భరోసా ఇస్తున్నారనే వాదన కాంగ్రెస్‌ వర్గాల నుంచి వస్తోంది.

త్వరలో అసెంబ్లీ నియోజకర్గాల పునర్విభజన జరుగుతుందనే చర్చ మొదలైంది. ఈ క్రమాన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకర్గాన్ని విభజించి కొత్తగూడెం, పాల్వంచగా ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉంది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ కోసం పలువురు నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ కేడర్‌లో జోష్‌ నింపేందుకు ఎంపీ రామసహాయం ద్వారా ‘హైకమాండ్‌’ ప్రయత్నిస్తోందనే వాఖ్యలు ఆ పార్టీలోనే కొందరు నేతల ద్వారా తెలుస్తోంది.

2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐలు మిత్ర పక్షాలుగా పోటీ చేశాయి. సుమారు రెండున్నరేళ్ల పాటు రెండు పార్టీల మధ్య సఖ్యతతో కూడిన వాతావరణమే కనిపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా బీటలు వారాయి. డివిజన్ల సర్దుబాటు విషయంలో ఏకాభిప్రాయం కుదరక రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. ఎక్కువ స్థానాల్లో సీపీఐ విజయం సాధించడంతో అనివార్యంగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చింది. పవర్‌ షేరింగ్‌ విధానంలో తొలి దఫా మేయర్‌ పీఠం సీపీఐకి దక్కింది. అప్పటి నుంచి అంతా సవ్యంగా సాగిపోతుందనే దశలో మరోసారి మిత్రపక్షాల మధ్య అలజడి రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement