భద్రాచలంటౌన్: భాషను కోల్పోతే అస్తిత్వాన్ని కోల్పోయినట్లేనని గుర్తించి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు జీవనాడిగా ఉన్న కోయ భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పంచాయతీరాజ్ కమిషనర్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దివ్య దేవరాజన్ తెలిపారు. పిల్లలకు చదువుతోపాటు మాతృభాషపై మమకారం, విలువను నేర్పించాలని సూచించారు. భద్రాచలంలోని గిరిజన భవన్‌లో మంగళవారం జరిగిన గోండి – కోయ భాషా ప్రామాణీరణ, నిఘంటువు వర్క్‌షాప్‌లో ఆమె పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు సదస్సులో పది రాష్ట్రాల నుంచి వచ్చిన 170 మంది ప్రతినిధులతో చర్చించి 15 వేల ప్రామాణిక పదాలను సేకరించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ మాట్లాడగా ఏపీఓ డేవిడ్‌రాజ్, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీడీ చందన, కన్వీనర్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.
●బూర్గంపాడు/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యాన గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వీబీ–జీ రామ్‌జీ పథకం ద్వారా మరిన్ని పనులు కల్పించాలని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ సూచించారు. బూర్గంపాడు మండల నాగినేనిప్రోలులో నిర్మించిన మ్యాజిక్ సోక్ ఫిట్, లక్ష్మీపురంలో గ్రామ సమాఖ్య భవన పననులను పరిశీలించాక నాగినేనిప్రోలులో మల్టీపర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ఎల్‌నినోతో వ్యవసాయ పనులు తక్కువగా ఉన్నందున గ్రామాల్లో డ్రెయిన్లు, పొలంబాటలు, గ్రావెల్ రోడ్ల నిర్మాణాల పనులను వీబీ–జీ రామ్ పథకం ద్వారా కూలీలకు కల్పించాలని తెలిపారు. జీపీల్లో మల్టీ పర్పస్ వర్కర్ల వేతనాల పెంపునకు మంత్రి సీతక్క సుముఖంగా చెప్పారు. అనంతరం లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగులో నిర్మిస్తున్న ఉన్న ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పీఆర్ కమిషనర్ దివ్య దేవరాజన్ పరిశీలించారు. కలెక్టర్ అంకిత్‌తో కలిసి భవనాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో పీఆర్ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ, అదనపు కలెక్టర్ విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ రామకృష్ణ, సర్పంచ్ బానోతు సరోజ, ఉపసర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
పీఆర్ కమిషనర్
దివ్య దేవరాజన్


