విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమగ్ర అభివృద్ధే లక్ష్యం

Oct 7 2026 12:47 AM | Updated on Oct 7 2026 12:47 AM

పాల్వంచ: విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పాఠాలు బోధించడమే కాక వసతులు, పౌష్టికాహారంపై అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్‌ అంకిత్‌ ఆదేశించారు. పాల్వంచలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుపై ఆరా తీసిన ఆయన గైర్హాజరైన వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం ఇంటర్‌మీడియట్‌, 7, 10 వ తరగతుల్లో పరీక్షల నిర్వహణను పరిశీలించడంతో పాటు నీట్‌ ప్రత్యేక శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆతర్వాత కిచెన్‌ షెడ్‌, స్టోర్‌ రూంలు తనిఖీ చేసి సూచనలు చేశారు. కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్‌ తులసి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జీఓ 76 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన, స్క్రూట్నీ, డిమాండ్‌ నోటీసుల జారీలో వేగం పెంచాలని కలెక్టర్‌ అంకిత్‌ సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఆయన ఆర్డీఓ మధు, తహసీల్దార్‌ పుల్లయ్యతో దరఖాస్తులపై సమీక్షించారు. జీఓ 76 కింద జిల్లాలో 4,031 దరఖాస్తులకు గాను 2,267 దరఖాస్తుల స్క్రూట్నీ పూర్తయిందని అధికారులు చెప్పారు. మిగిలిన దరఖాస్తుల విచారణపై సూచనలు చేసిన కలెక్టర్‌.. ఇప్పటికే పూర్తయిన దరఖాస్తులను కూడా మరోమారు పరిశీలించాలని సూచించారు.

కేజీబీవీ తనిఖీలో కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement