భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అలాగే, స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు పూర్తిచేశారు.
రామయ్య సన్నిధిలో ఎమ్మెల్సీ
శ్రీ సీతారామ చంద్రస్వామిని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలకగా, దర్శనం అనంతరం వేదాశీర్వచనం అందజేశారు.
1,317 మె.టన్నుల యూరియా
చింతకాని: మూడు జిల్లాల అవసరాల నిమిత్తం చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు మంగళవారం ఆర్‌సీఎఫ్ కంపెనీకి చెందిన 1,317.19 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 517.19 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 500 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 200 మె.టన్నులు కేటాయించినట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్ల య్య తెలిపారు. మరో 100 మె. టన్నుల యూరియా బఫర్ స్టాక్‌గా నిల్వ చేశామని పేర్కొన్నారు.
ఎప్పటికప్పుడు ఉద్యోగుల వివరాలు నమోదు
చుంచుపల్లి: వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని కేడర్ వారీగా ఉద్యోగులు, పోస్టులు, ఖాళీల వివరా లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్ సూచించా రు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవా రం ఆయన సీనియర్, జూనియర్ సహాయకులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల్లో వ్యక్తిగత, సేవా వివరాలల్లో తప్పులు ఉంటే సరిచేయడంతో పాటు సేవా పుస్తకాలు కూడా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. శాఖాపరంగా పరిపాలన సజావుగా సాగేలా ఉద్యోగుల వివరాలు కచ్చితంగా ఉండాలని తెలిపారు.
గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ
భద్రాచలం: గిరిజనుల ఆర్థిక, సామాజికాభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యాన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు పీఓను మంగళవారం కలగావ, ఐటీడీఏ పరిధిలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. గిరిజన మహిళలు తయారుచేస్తున్న ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌ కర్యం కల్పించేలా భద్రగిరి మార్ట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు జీసీసీ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తున్నామని తెలిపారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండడంతో ఏటా పలువురు ఐఐటీ, నిట్, ఎంబీబీఎస్‌కు ఎంపికవుతున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా స్వయం ఉపాధి పొందుతున్న గిరిజన మహిళలను గుర్తించి వారికి చేయూతగా నిలిచేలా ఐటీడీఏల్లో పర్యటిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. జీసీసీ డీఎం రామానందం, అధికారులు మాధవి, విజయకుమారి, సురేష్‌కుమార్, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు, జయరాజ్, సమ్మయ్య పాల్గొన్నారు. కాగా, నిరక్షరాస్యులు, మధ్యలో చదువు మానేసిన వారు ఉల్లాస్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా చదువుకోవచ్చని పీఓ రాహుల్ తెలిపారు. ఈమేరకు వయోజన విద్యాశాఖ రూపొందించిన ఉల్లాస్, టాస్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.


