భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో సోమవారం సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరా ధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని పీఎం శ్రీ సెకండరీ స్కూళ్లలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్ల లకు విద్యాసహాయం అందించేందుకు గెస్ట్ స్పెషల్ నీడ్స్ ఎడ్యుకేటర పోస్టులను స్వల్ప కాలిక ప్రాతిపదికన భర్తీచేయనున్నట్లు విద్యాశాఖాధికారి శంభూప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కేటాయించిన పాఠశాల, అవసరమైనప్పడు సంబంధిత భవిత సెంటర్లలో సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. నియామకం నవంబర్ 2026 నుంచి మార్చి 2027 వరకు ఐదు నెలలు మాత్రమే ఉంటుందని తెలిపారు. నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లిస్తామని, దరఖాస్తులను ఈ నెల 8వ తేది లోగా పీఎం శ్రీ పాఠశాలల్లో అందజేయాలని సూచించారు.
బార్‌షాపు ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ
కొత్తగూడెంఅర్బన్: అశ్వారావుపేటలో బార్‌షాపు ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. సోమవారం జిల్లా ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి ఏ.శ్రీనివాసరెడ్డికి జె.విజయచైతన్య, ఎం.చిన్నలక్ష్మీనారాయణలు దరఖాస్తులను అందజేశారు. డ్రాలో ఎంపికై న వారికి షాపు కేటాయిస్తామని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. ఏఈఎస్ శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ఓపెన్’ పరీక్షలకు
ఏర్పాట్లు చేయాలి
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 11 నుంచి 17వ తేది వరకు జరిగే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.పద్మావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 639 మంది ఎస్సెస్సీ, 422 మంది అభ్యర్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి శంభూప్రసాద్, డీపీఓ అనూష, ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు, వైద్య, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ అధికారులు పాల్గొన్నారు.
ఐటీసీ వ్యర్థ జలాల పరిశీలన
నమూనాలు సేకరించిన ిపీసీబీ అధికారులు
బూర్గంపాడు: మండల సారపాకలోన ఐటీసీ పీఎస్పీడీ పరిశ్రమ నుంచి వెలువడుతున్న వ్యర్థ జలాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు సోమవారం పరిశీలించారు. పరీక్ష ల కోసం నమూనాలను సేకరించారు. నాలుగో వార్డు పరిధిలో ఐటీసీ సంస్థ విడుదల చేస్తున్న వ్యర్థ జలాలను సరిగా శుద్ధి చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సర్పంచ్ గుగులోత్ కిషోర్ శివరాంనాయక్ సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. సమస్యను పొల్యూషన్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సారపాక చేరుకుని వ్యర్థ జలాల నమూనాలను సేకరించారు. ల్యాబ్‌లో పరి శీలించి నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


